కన్నడ పరిశ్రమలో ‘బాహుబలి’ చిచ్చు

‘డబ్బింగ్ సినిమాలు కన్నడలో విడుదల చేస్తే అది ప్రజల్లో ఆగ్రహానికి దారితీసి థియేటర్లను తగులబెట్టే పరిస్థితి రావచ్చునని’ కన్నడ సినీనటుడు జగ్గేష్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో కన్నడ సినీ పరిశ్రమ కదిలింది.. డబ్బింగ్ సినిమాలకు వ్యతిరేకంగా కన్నడ పరిశ్రమ మరోసారి ఏకమవుతోంది.. దీనంతటికి కారణం.. బాహుబలి2 సినిమాను తొలిసారి కన్నడలో విడుదల చేయడమే .. బాహుబలి2 సినిమాతోనే డబ్బింగ్ సినిమాలను కన్నడలో అనుమతించాలని కొద్దిరోజుల క్రితం కన్నడ సినీ పరిశ్రమ నిర్ణయించింది.. దీంతో వివాదం రాజుకుంది. హీరో జగ్గేష్ ట్వీట్ తో అది మరింత ముదిరింది.. కన్నడ సినీ పరిశ్రమలో డబ్బింగ్ భూతానికి అనుమతి ప్రశ్నేలేదని కన్నడ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు వాటాళ్ నాగరాజ్ ప్రకటించారు. బెంగళూరు ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఆయన డబ్బింగ్ సినిమాలపై నిషేధం కొనసాగించాలని.. అనుమతిస్తే కన్నడ సినీ పరిశ్రమతో పాటు కళాకరులు, నటులకు ఉపాధి దూరమవుతోందని ఆయన వాపోయారు. అందులో భాగంగానే ఈనెల 6న కన్నడ సంఘాలు, సినిమా వర్గాలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి అగ్నికి ఆజ్యం పోశారు.

బాహుబలి2 ను కన్నడలో రిలీజ్ చేయాలని కన్నడ పరిశ్రమ సంఘం నిర్ణయించడం వివాదాస్పదమైంది. ఈనెల 6న సమావేశం.. 9న ప్రత్యేక జాతాను నిర్వహిస్తామని.. డబ్బింగ్ నిషేధాన్ని కొనసాగించాలని కన్నడ పరిశ్రమ కోరుకుంటోంది. కన్నడిగుల ప్రయోజనాలను కాపాడే దిశగా డబ్బింగ్ ను వ్యతిరేకించాలని ఆయన విజ్ఞప్తి చేశారు..

ఈ పరిణామాలతో బాహుబలి2 కన్నడ రిలీజ్ ప్రశ్నార్థకంగా మారింది. కన్నడ లో కూడా పరభాష చిత్రాలు విడుదల అవుతాయని ఆశించిన నిర్మాతలు ,దర్శకులకు ఇది ఆనందాన్నించ్చింది. కానీ అంతలోనే ఓ నటుడి ట్విట్టర్ ప్రకటన.. ఆ తర్వాత కన్నడ పరిశ్రమ ఐక్యతతో మళ్లీ డబ్బింగ్ సినిమాలు కన్నడలో రిలీజ్ కావడం ప్రశ్నార్థకంగా మారింది..

To Top

Send this to a friend