కదిలే హృదయుడు.. పవన్ కళ్యాణ్.

‘మా కన్నీళ్లు తుడిచేవారెవరు అని ఆర్తిగా చూస్తున్న నేతన్నలకు, వారి కుటుంబ సభ్యులకు నేనున్నాని వచ్చాడు కాటన్ రాయుడు పవన్ కళ్యాణ్. చేనేత సత్యాగ్రహం, గర్జనలో పాల్గొనడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ను.. చేనేతలు, మీడియా ఇప్పుడు ముద్దగా ‘కాటన్’ రాయుడు అని పిలుస్తున్నారు. త్వరలో విడుదల కాబోతున్న ‘కాటమ రాయుడు’ సినిమాకు పోలుస్తూ ఈ హెడ్డింగ్ పెట్టారు.
రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి చేనేత రంగమే.. 18 కులాలకు చెందిన వేలాది మంది కార్మికుల జీవితాలు మరమగ్గాల కింద నలిగిపోతున్నాయి. పొట్ట గడవక, అప్పులపాలై వందలాది మంది చేనేతన్నలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు మనం వేసుకునే దుస్తుల్లో చాలా వరకు కాటన్, సింథటిక్ దుస్తులు ఉంటున్నాయి. దళారులు తక్కువకు చేనేతల దగ్గర కొని మనకు దుస్తులు కుట్టి వేలకు అమ్ముతున్నారు. మధ్యలో దళారులు లాభపడుతూ చేనేతలు చిక్కిపోతున్నారు. ఇలా దశాబ్దాలుగా పాలకు నిర్లక్ష్యం వల్ల చేనేత రంగం చీలికలు పీలికలైంది. పేరుకు సొసైటీలున్నా పెత్తనమంతా పైవారే నొక్కేస్తూ కార్మికుడికి పైసా విదిల్చడం లేదు. వారం రోజుల కూలీ 15-200కి మించడం లేదు. సంవత్సరమంతా పనిదొరకని పరిస్థితుల్లో చేనేతలు అసువులు బాస్తున్నారు.
ఇంతటి దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న చేనేతల బతుకులు చూసి పవన్ చలించాడు. ఎవ్వరూ ఆపదలో ఉన్న ముందుకొచ్చే పవన్ తాను చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని స్పష్టం చేశాడు. అంతేకాదు బాబు ఎన్నికల హామీ మేరకు చేనేతలకు రుణమాఫీ చేయాలని.. బ్యాంకుల ద్వారా రుణాలివ్వాలని.. బడ్జెట్ నిధులిచ్చి.. మరమగ్గాలు ఇప్పించి చేనేతన్నల బతుకులు బాగుచేయాలని పిలుపునిచ్చారు. పవన్ చంద్రబాబు సర్కారు తీరుపై ధ్వజమెత్తడంతో ఇప్పటికైనా ప్రభుత్వం చేనేతలకు ఆర్థిక భరోసా ఇస్తుందో లేదో చూడాలి. అడగ్గానే మంగళగిరి వచ్చి చేనేతన్నల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన పవన్ ను చేనేతలు ఘనంగా సన్మానించారు. సమస్యల పరిష్కారంలో చొరవ చూపినందుకు తమ గుండెల్లో పెట్టుకున్నారు. పవన్ సభ ముగిశాక చేనేతన్నల మాటల్లో ఆ కృతజ్ఞత కనపడింది..

To Top

Send this to a friend