కత్తులు, కటార్లు అక్కర్లేదు.. వర్మ ఉంటే చాలు..

vangaveeti-rgv-apnewsonline

కాంట్రవర్సీ ఉండాలబ్బా.. లేకపోతే ఆయన కడుపు ఉబ్బిపోద్దీ.. ఓ ఈనో కొనుక్కొని తాగినా ఆరగదు.. కాంట్రవర్సీతోనే ఆయనకు రోజు గడిచేది అది ట్విట్టర్ వేదికపైన అయినా లేదా.. మీడియాలోనైనా.. బాహుబలి లాంటి రాజుల ఇమాజిన్ కథలు.. హ్యాపీడేస్ లాంటి ప్రేమ కథలు ఆయనకు నప్పవు.. పారాల్సిందే.. రక్తం ఏరులై పారితేనే ఆయన కళ్లు చల్లబడుతాయి.. పరిగెత్తుకుంటూ నరికి చంపడాలు.. గన్నులతో కాల్చిచంపడాలు.. అదీ కిరాతకంగా చేస్తేనే ఆయన ఆకలి తీరుతుంది.. ఇంతకీ ఆయన ఎవరంటారా.. అదే ఆల్ టైం కాంట్రవర్సీ మ్యాన్.. ‘రాంగోపాల్ వర్మ’..

వాస్తవ కథలను తెరకెక్కించడంలో అందేవేసిన చెయ్యి వర్మదీ.. పాక్ ఉగ్రవాదులు తాజ్ హోటల్ పై దాడిచేస్తే అది వర్మ కథా వస్తువు అవుతుంది. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ లోని కోణాల్ని ఆవిష్కరింపచేస్తుంది.. రాయలసీమ రక్తపాతాన్ని ఏరులైపారించిన రక్తచరిత్ర వెనుక మూలాల్ని తట్టిలేపుతుంది.. ఎంతైనా వాస్తవిక కథల్ని సినిమాటిక్ గా మలచడంలో.. ఆ చరిత్రలను తవ్వితీయడంలో అందేవేసిన చెయ్యి వర్మది.. ఇప్పుడూ అదే చేశాడు .. కానీ అది గురితప్పింది…

వర్మ విసిరిన ‘వంగవీటి’ బాణం గురితప్పింది.. కథ టైటిల్ రోల్ ను హీరోగా చూపించబోయి విలన్ ను చేసేశాడు.. అహం దెబ్బతిన్న వంగవీటి అభిమానులు ఇప్పుడు వర్మ కానీ, వంగవీటి మూవీ సినిమా నిర్మాత కానీ దొరికితే ఏసేస్తామన్నంత కసిగా ఉన్నారు.. బెజవాడ రౌడీ రాజకీయం చంపుకోవడాలు, దాడులు, ప్రతిదాడులు మాత్రమే చూపించి వర్మ అసలు కథను పక్కదారి పట్టించాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రంగ హత్యను అయ్యప్ప మలధారులు చేస్తారు.. వారు ఎవరు ఎందుకు చేశారు దీని వెనుక ఎవరెవరు ఉన్నారన్న సంగతులకు వర్మ పోలేదు.. కేవలం కత్తులు , కటార్లు, చంపుకోవడాలు చూపించాడు.. ఒక వర్గం వారిని విలన్లను చేసి, మరో వర్గం వారిని హీరోలను చేసి ఇతబద్దంగా వెనుక ఏం జరిగిందో చెప్పలేకపోయాడు.. రక్త చరిత్ర సినిమా చూస్తే అందులో ఎందుకు చంపుకున్నారో తెలుస్తుంది.. ఎవరు హీరోనో, విలన్లో తెలుస్తుంది. కానీ వంగవీటి ఒక గురితప్పిన బాణంలా చంపుకోవడాలు, దాడులతోనే ముగిసింది.. సినిమాలో తమ నాయకుడిని అవమానించాడని గాయపడిన కొందరు అభిమానులు ఇప్పుడు వర్మపై మండిపడుతున్నారు… దొరికితే కొట్టేద్దమన్నంత కోపంగా ఉన్నారు.. వర్మ కూడా అంతే మొండిగా ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నాడు..
-నరేశ్, సీనియర్ జర్నలిస్ట్

To Top

Send this to a friend