కంగారూల వేషాలు తగ్గలేదు..


మొన్నటి రెండో టెస్టులో డీఆర్ఎస్ విధానంలో అడ్డంగా బుక్ అయిన ఆస్ట్రేలియా కెప్టెన్ విమర్శల పాలయ్యారు. విరాట్ కోహ్లీ అసీస్ కెప్టెన్ ను అడ్డంగా బుక్ చేశాడు. ఆ మంట ఇంకా ఆస్ట్రేలియన్లు, ఆ దేశ క్రికెటర్లలో ఇంకా పోలేదు. అందుకే కోహ్లీ కోసం గోతికాడ నక్కల్లా ఎదురుచూస్తూనే ఉన్నారు ..

మనోడు కోహ్లీ ఈ మధ్య ఆస్ట్రేలియా సిరీస్ లో బాగా ఆడడం లేదు. 50 పరుగులు కూడా చేయలేకపోతున్నాడు. ఇటీవల రెండో టెస్టులో ఫీల్డింగ్ చేస్తూ రెండో రోజు ఆసలు ఆటనే ఆడలేదు. ఈ నేపథ్యంలో కోహ్లీ పడి గాయపడ్డప్పుడు చేసిన చేష్టను ఆస్ట్రేలియా క్రికెటర్ మ్యాక్స్ వెల్ చేసి సెటైర్ వేశాడు. ఇది వీడియోల్లో రావడంతో అందరూ దానిపైనే ఫోకస్ చేశారు. ఇది కోహ్లీని రెచ్చగొట్టింది. అందుకే రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియన్లు ఔవుట్ కాగానే కోహ్లీ కూడా ఆస్ట్రేలియన్లు చేసిన సెటైర్ లాగే చేసి వారికి పంచ్ ఇచ్చారు. టిట్ ఫర్ టాట్ అంటూ భారత కెప్టెన్ ఆస్ట్రేలియన్ల దూకుడు మించి వారికి కౌంటర్ ఇస్తున్నాడు. దీంతో మూడో టెస్టు రసకందాయంలో పడింది..

*మూడోరోజులు వారివే.. నాలుగు నుంచి మనది..
అసలు మూడో టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 451 పరుగులు చేశాక.. ఇండియా ఈ టెస్టు డ్రా చేసుకుంటే అదే పదివేలు అనుకున్నాం.. అలానే మూడు రోజులు ఆస్ట్రేలియా ఆధిపత్యమే సాగింది. కానీ భారత బ్యాట్స్ మెన్ పూజారా డబుల్ సెంచరీ(202), సాహా 117 సెంచరీ చేయడంతో భారత్ నాలుగో రోజు మ్యాచ్ ను శాసించే స్థితికి చేరింది. దీంతో ఇప్పుడు చివరిరోజు సోమవారం 150కి పరుగుల ఆధిక్యంతో భారత్ ఆస్ట్రేలియాను కాచుకో అని సవాల్ విసిరింది. ఈరోజు రోజంతా భారత బౌలింగ్ దాడిని కాచుకొని నిలబడితే ఆస్ట్రేలియా గెలుస్తుంది.. లేదంటే అసీస్ కు ఓటమి ఖాయం. కాగా 4వ రోజే ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో మూడో టెస్టు రసవత్తరంగా మారింది.

To Top

Send this to a friend