కంగారు తొండి.. కోహ్లీ జగమొండి..


మాటల తూటాలు పేలుతున్నాయి. ఆస్ట్రేలియా చేతిలో మొదటి టెస్ట్ నిన్న ముగిసిన రెండో టెస్టులో ఆటగాళ్లు తీవ్ర ఉద్విగ్నతకు లోనవుతున్నారు. గెలవాలన్న కసితో ప్రత్యర్థులపై స్లెడ్జింగ్ కు దిగుతున్నారు. రెండో టెస్ట్ లో ఆస్ట్రేలియా ఆటగాళ్ల తొండి ఆటను కెప్టెన్ కోహ్లీ రట్టు చేయడంతో ప్రపంచం మొత్తం కంగారుల ఆటను దుమ్మెత్తి పోస్తోంది. తొండి ఆట ఆడి గెలుస్తారా అంటూ విమర్శలు చేస్తోంది. ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ కూడా తనకు మైదానంలో బుర్ర పనిచేయక ఔటైనా వెళ్లకుండా డ్రెస్సింగ్ రూం వైపు చూసి తప్పు చేశానని ఒప్పుకున్నారు. దీనిపై కోహ్లీ విలేకరుల సమావేశంలో ఆసీస్ ది తొండి ఆటని.. వాళ్లు మోసగాళ్లు అంటూ పరోక్షంగా విమర్శించారు. ఇలా తొలిటెస్ట్ నుంచి వాళ్లు మోసం చేస్తున్నారని.. దీన్ని తాను గమనించానని కోహ్లీ తేల్చిచెప్పారు.

కంగారూలు ఎలాగైనా భారత గడ్డపై గెలవాలని తొండి ఆట ఆడుతున్నారు. మొదటిటెస్ట్ లో కూడా డీఆర్ఎస్ ను ఇలా తప్పుగా వాడేశారు. డ్రెస్సింగ్ రూం ఆదేశాను సారం ఔటా నాటౌట్ అని నిర్ధారించుకున్నాక ఎంపైర్లను రివ్యూ కోరారు. ఇది క్రికెట్ నిబంధనలకు విరుద్ధం.. స్మిత్ ఔటనప్పుడు కూడా ఇలానే బహిరంగంగా చేయడం.. ఎంపైర్, కోహ్లీ చూసి మందలించడంతో కథ అడ్డం తిరిగి కంగారుల పరువు టీవీల సాక్షిగా బయటపడి దిమ్మదిరిగిపోయింది..

To Top

Send this to a friend