‘కంగారు’గా కొడతారా..? పడతారా.?

ఇది కోహ్లీ శకం.. రెండేళ్లుగా కోహ్లీ నాయకత్వంలోని భారత టెస్ట్ జట్టుకు ఓటేమే లేదు.. ధోని నుంచి పగ్గాలు చేపట్టిన నాటినుంచి కోహ్లీ వరుస సీరిస్ లు గెలుస్తూ ఓటమి ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందాడు.. దక్షిణాఫ్రికా.. ఆ తర్వాత న్యూజిలాండ్, ఇంగ్లాండ్.. మొన్న బంగ్లాదేశ్ ను మట్టికరిపించి ఓటమి లేకుండా అప్రతిహత జైత్రయాత్ర కొనసాగస్తున్నారు.

పదేళ్లు దాటింది.. ఆస్ట్రేలియా భారత పర్యటనలో సిరీస్ గెలవక దశాబ్ధం.. గడిచిన ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ 4-0తో ఆస్ట్రేలియాను చిత్తుచిత్తుగా ఓడించి వైట్ వాష్ చేసి ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. భారత్ దెబ్బకు దిగ్గజ ఆటగాళ్లైన వాట్సన్, హాసి లాంటి ఆటగాళ్లు రాణించక కెరీర్ ను వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి ఫైట్ కు మరోసారి రంగం సిద్ధమైంది.

ఈరోజు నుంచి ఆస్ట్రేలియా భారత పర్యటన ప్రారంభమైంది. 4 టెస్టుల సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా భారత్ లో తొలిటెస్టును గురువారం పుణెలో మొదలుపెట్టింది. మొదట ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేపట్టింది. స్మిత్ సేన భారత్ లో గెలుస్తుందా.. పోయినసారిలాగే తోకముడుస్తుందా.. మరి కోహ్లీ సేనకు గట్టిపోటీ ఇచ్చి షాక్ ఇస్తుందా అని అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆస్ట్రేలియా గట్టి ప్రత్యర్థి కావడంతో అందరూ టీవీలకు అతుక్కుపోయారు. దిగ్గజాల మధ్య జరుగుతున్న ఈ మహాసంగ్రామం ఈనెలలో అభిమానులను  అలరించనుంది.

To Top

Send this to a friend