ఓ సంపూ.. నీ ఐడియా అదుర్స్.

అందరూ అమెరికా, బ్రిటన్, చైనా, యూరప్ లలో తమ సినిమా ఆడాలని కాసిన్ని డబ్బులు రావాలని కోరుకోవడం సహజం.. ఎందుకంటే అవన్నీ సంపన్న దేశాలు.. కాస్ట్ ఎక్కువ.. సినిమా కొద్దిగా ఆడినా మిలియన్ల కొద్దీ డబ్బు వస్తుంది. తెలుగు నిర్మాతలు, హీరోల పంట పండుతుంది. డాలర్ విలువ ఎక్కువ కాబట్టి అమెరికా, బ్రిటన్ లలో సినిమాలు ఆడాలని అక్కడా తెలుగు నిర్మాతలు రిలీజ్ చేస్తున్నారు..

కానీ మన బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తీరే వారు.. అంతా డిఫెరెంట్.. ఆయన సినిమాల్లోనే అది కనిపిస్తుంది. చచ్చాక కూడా హీరోయిన్ పిలిస్తే చితినుంచి లేచి వచ్చి విలన్ని చంపేసే కామెడీ థ్రిల్లర్స్ ఆయన సినిమాల్లోనే కనిపిస్తుంది. సీరియస్ కామెడీ అంటూ తెలుగు సినిమాలకు కొత్త పంథా నేర్పుతున్న ఈ కమెడియన్ కం హీరో సంపూ తన సినిమాల విడుదలలో కూడా కొత్తగా ఆలోచిస్తున్నాడు. రోటీన్ గా అమెరికా,బ్రిటన్ లో కాకుండా ఆఫ్రికా మార్కెట్ పై కన్నేశాడు. కొబ్బరి మట్ట సినిమాను ఆఫ్రికా దేశాల్లోకి అనువదించాలని నిర్ణయించారు. ముందుగా నైజీరియన్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. ఈ విధంగా తొలి తెలుగు-నైజిరియన్ స్టార్ గా అవతరించేందుకు సంపూ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడట.. తన సినిమా కొబ్బరిమట్ట ఆద్యంతం కామెడీ, సీరియస్ ఎంటర్ టైనర్ అని సినిమా చూసినవారందరూ కడుపు చెక్కలయ్యేలా నవ్వుతారని సంపూ చెబుతున్నాడు. నైజీరియాలో గనుక హిట్ సాధిస్తే ఇక మనోడు ఆఫ్రికన్ స్టార్ గా కూడా పేరుపొందడం ఖాయంగా కనిపిస్తోంది..

To Top

Send this to a friend