ఓసారి సీరియస్ సబ్జెక్ట్.. ఇంకోసారి కామెడీ ట్రాక్.. ఈసారి?

trivikram-srinivas-mahesh-babus-apnewsonline

త్రివిక్రమ్ శ్రీనివాస్ .. రచయితగా అద్భుతంగా మాటలు రాసి ఇండస్ట్రీలో పేరు సంపాదించారు. అప్పట్లో తెరవెనుక ఉండి విజయభాస్కర్ లాంటి దర్శకుల విజయాల్లో కీలక పాత్ర పోషించారు. కానీ ‘అతడు’ మూవీ త్రివిక్రమ్ ను ఇండస్ట్రీలో నిలబెట్టింది. మహేశ్ బాబును ఓ మెట్టు ఎక్కించింది. నిజానికి అతడు స్టోరీ చాలా సీరియస్ సబ్జెక్ట్.. ఫస్ట్ ఆఫ్ కొద్దిగా అయ్యాక అంతా కామెడీ ట్రాక్ లోకి వెళ్లిపోతుంది. చివర్లో మళ్లీ సిరియస్ కనిపిస్తుంది.. ఓవరాల్ గా కథాపరంగా అది సీరియస్ గా జరిగే స్టోరీనే.. ఇక ఖలేజా అలా కాదు.. మాటల మాంత్రికుడి మాటలన్నీ మహేశ్ చేత పలికించాడు. కామెడీ ట్రాక్ తోనే సినిమా నడుస్తోంది. దీన్ని కామెడీ టచ్ మూవీగానే పరిగణించవచ్చు.. ఇప్పుడు ఈ రెండు సినిమాల తర్వాత మళ్లీ 2018లో మహేశ్-త్రివిక్రమ్ లు సినిమా చేసేందుకు ఒప్పుకున్నారు. మైత్రీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.. దీన్ని మహేశ్ ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించారు..
త్రివిక్రమ్ అతడు, ఖలేజా తర్వాత మహేశ్ తో ఎలాంటి మూవీని తీస్తాడనే ఆసక్తి అందరిలోనూ ఉంది.. కామెడీనా, సీరియస్ సబ్జెక్ లో కామెడీ ట్రాకా..? ఇలా సవాలక్ష ప్రశ్నలున్నాయి. ఎన్నాళ్లో నుంచి కౌబాయ్ గెటప్ లో భారీ చిత్రం చేయాలని మహేశ్ అనుకుంటున్నాడట.. మరి అలాంటి ప్రయత్నమేమైనా త్రివిక్రమ్ చేస్తాడేమో చూడాలి. మొత్తానికి మహేశ్-త్రివిక్రమ్ సినిమా సెట్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

To Top

Send this to a friend