ఓటుకు నోటు: బాబుకు పడింది సుప్రీం పోటు

తనపై ఏ కేసు వచ్చినా తన పరపతిని ఉపయోగించి న్యాయవ్యవస్థతో స్టేలు తెచ్చుకుంటున్న ఏపీ సీఎం చంద్రబాబు తన రాజకీయ కేరిర్ లో పెద్దగా కేసులు ఎదుర్కొన్న దాఖలాలు లేవు.. రాజకీయాల్లో పలుకుబడి ఇతర కారణాలతో ఆయనపై కేసులు నిలబడలేదు. కొన్ని కేసులు నిర్ధారణ కాలేదు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చాలా కేసులు పెట్టినా ఒక్కటి కూడా నిలబడలేదు.. అప్పట్లో ఎన్నో కేసుల్ని హైకోర్టు, సుప్రీం కోర్టు కెళ్లి స్టేలు తెచ్చుకొని నీరుగార్చేలా చేశారు చంద్రబాబు..

ఎన్నో ఠక్కుటమారా విద్యలు తెలిసిన చంద్రబాబు… కేసీఆర్ వేసిన వ్యూహానికి చిక్కి విలవిలలాడారు. ఓటుకు నోటు కేసు చంద్రబాబు రాజకీయ జీవితంలోనే పెద్ద మాయని మచ్చగా నిలిచిపోయింది. ఆ కేసు నుంచి బయటపడడానికి చంద్రబాబు ఏకంగా కేసీఆర్ షరతులకు లొంగిపోయారని.. చాలా చీకటి ఒప్పందాలు జరిగాయని ఇన్ సైడ్ టాక్.. అందుకే హైదరాబాద్ ఖాళీ చేసి బాబు మకాంను విజయవాడ మార్చారు. ఏదో లా కేసును అయితే నీరుగార్చే ప్రయత్నాలు తెరవెనుక జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఓటుకు నోటు కేసును కేసీఆర్, ఇతరులు వదిలేసినా.. ప్రతిపక్ష వైసీపీ పార్టీ మాత్రం వదలడం లేదు.. జగన్ ప్రోద్బలంతో వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో దోషి అని ఏసీబీ కోర్టులో ఫిర్యాదు చేయడంతో కేసు మలుపుతిరిగింది. చంద్రబాబుపై విచారణకు కోర్టు ఆదేశించింది. దీనిపై హైకోర్టుకెళ్లిన బాబు స్టే తెచ్చుకున్నాడు. దీన్ని సవాలు చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే సుప్రీం కెళ్లడంతో సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. హైకోర్టులో బతికిపోయిన చంద్రబాబు.. ఇప్పుడు సుప్రీంలో విచారణను ఎదుర్కొంటుండడం ఆయనను ఇరకాటంలోకి నెట్టింది.. దీంతో మరోసారి ఓటుకు నోటు కేసు.. చంద్రబాబుకు చిక్కులు తెచ్చిపెడుతోంది.

To Top

Send this to a friend