‘ఓంనమో’తో అన్యాయమైపోయిన నాగార్జున..

2017లో విడుదలైన అన్ని పెద్ద సినిమాలు దాదాపు భారీ హిట్ లు అయ్యాయి. మొదల ఖైదీనంబర్ 150, బాలయ్య శాతకర్ణి, దిల్ రాజు శతమానం భవతి, నేనూ లోకల్ సినిమాలు బాక్సాఫీసు వద్ద భారీ హిట్ లు కొట్టాయి. కానీ ఫిబ్రవరిలో విడుదలైన పెద్ద హీరో నాగార్జున చిత్రం ‘ఓం నమో వేంకటాశయ’ చిత్రం అట్టర్ ప్లాప్  గా టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు పేర్కోంటున్నాయి. మొదట్లో ఈ సినిమా కూడా అన్నమయ్యలా స్లోగా స్టాట్ అయ్యి విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమాకు జనాలే కరువయ్యారట.. సీజన్ కానీ సీజన్ లో విడుదలైన చిత్రాన్ని చూసే నాథుడే లేక అట్లర్ ప్లాప్ తెచ్చుకుంటోంది. సినిమాకు ఓపెనింగ్స్ దెబ్బతీశాయి. వారం గడిచినా సినిమా పుంజుకోకపోవడంతో నాగార్జున కెరీర్లోనే సినిమా బిగ్గెస్ట్ ప్లాపుగా నిలిచిపోయిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

రెండో వారంలో కూడా సినిమాకు ఆశించిన వసూళ్లు రావడం లేదట.. సినిమాలేవీ లేకున్నా నాగార్జున ఆధ్యాత్మిక చిత్రాన్ని చూడడానికి జనం ఆసక్తి చూపించడం లేదు.

అన్నమయ్య, భక్తరామదాసు చిత్రాల్లోని ట్విస్ట్ లు, ఆసక్తి చరిత్ర ఇందులో క్యూరియాసిటీ లేకపోవడం చిత్రంలో భారీ మైనస్ గా ప్రేక్షకులు చెబుతున్నారు. క్లైమాక్స్ కూడా పెద్ద ట్విస్ట్ లేకపోవడం సినిమాను దెబ్బతీసింది.. కథ సాదాసీదాగా సాగడం కూడా ప్రేక్షకులకు నచ్చడం లేదు. అందుకే మౌత్ పబ్లిసిటీతో సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది.

ఈ వారం ఘాజీ సినిమా విడుదలవుతుండడం.. ఆ సినిమాకు రివ్యూ రైటర్లు భారీ హైప్ నివ్వడంతో నాగార్జున చిత్రం మరో వారం ఆడడం కష్టమేనన్న టాక్ వినిపిస్తోంది. రాఘవేంద్రరావు మొదట కథ వినిపించగానే నాగార్జున సైతం ఈ కథను చేయడానికి తటపటాయించడాడట.. కానీ దిగ్గజ దర్శకుడే ఈ చిత్రాన్ని చేపట్టడంతో మారుమాట్లాడకుండా చేశాడు. కానీ నాగార్జున జడ్జిమెంటే రుజువై ఓంనమో వేంకటేశాయ అట్లర్ ప్లాప్ అయ్యింది. రాఘవేంద్రరావు స్టామినా కూడా చిత్రానికి ఉపయోగపడలేదు.. ప్రధానంగా వేంకటేశ్వరుడి పై ఇదివరకే అన్నమయ్య రావడం.. భక్త రామదాసుతో నాగార్జున హిట్ కొట్టడంతో ఈ కొత్త చిత్రం ‘ఓం నమో’పై ప్రేక్షకులకు ఆసక్తి తగ్గిపోయింది. కథ కూడా తీసికట్టుగా ఉండడంతో ప్రేక్షకులను మెప్పించలేక చిత్రం చతికిలపడింది. దీంతో నాగార్జున ఈ సంవత్సరంలోనే అతిపెద్ద డిజాస్టర్ ను ఎదుర్కొంటున్నారు.

To Top

Send this to a friend