ఒబామా కు పూర్తి డిఫెరెంట్ ట్రంప్..

Republican presidential candidate, businessman Donald Trump speaks during the Fox Business Network Republican presidential debate at the North Charleston Coliseum, Thursday, Jan. 14, 2016, in North Charleston, S.C. (AP Photo/Chuck Burton)

ఒబామా ప్రపంచ సమస్యలే తన సమస్యలు అనుకున్నాడు. ఎక్కడ లొల్లి జరిగినా పెద్దన్నలా అమెరికా దళాల్ని దింపి యుద్దం చేశాడు. లాడెన్ ను చంపేశాడు. అఫ్ఘన్ లో అమెరికా సేనల్ని దించాడు. సిరియా ఐసిస్ పై యుద్ధం చేస్తున్నాడు. విదేశీ కంపెనీలను ఆహ్వానించి అమెరికాను గ్లోబల్ కంట్రీగా మార్చాడు. అది కొంత కాలం వరకు పనిచేసింది. విదేశీ కంపెనీలకు అమెరికా స్వర్గధామం అయ్యింది. విదేశీయులకే ఉద్యోగాలు దక్కాయి. అమెరికా పౌరులకు కానకష్టంగా మారింది. నిరుద్యోగం ప్రబలిపోయింది. తమ ఉద్యోగాలు విదేశీయులు కొల్లగొడుతున్నారనే ఆవేదన అమెరికన్లలో నాటుకుపోయింది. దేశం గురించి ఆలోచించక వేరేదేశాల్లో సైనికులను దింపి, ఆర్థికసాయం చేయడం వంటి విషయాలు ఒబామాపై వ్యతిరేకతకు కారణమయ్యాయి. ఆయన పార్టీ తరఫున నిలబడ్డ హిల్లరీ క్లింటన్ ను దారుణంగా ఓటమి పాలు చేశాయి.

దాదాపు పదేళ్లుగా గెలవని రిపబ్లికన్ పార్టీకి ప్రజలు పట్టంకట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి, నోటిదురుసు సహా చాలా వెగటు అలవాట్లున్నా ట్రంప్ నే అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు అమెరికన్లు.. ట్రంప్ అన్నింట్లో బ్యాడ్ గా ఉన్న ఆయన నినాదమే ఆయన్ను గెలిపించింది. అదే అమెరికాయే ఫస్ట్.. ఆ తర్వాతే మిగతా దేశాలు.. ముందుకు మన అమెరికన్లకు ఉద్యోగాలు, నిధులు, అంతర్గత సమస్యలే ప్రధాన ఎజెండా అని ట్రంప్ ప్రకటించడమే ఆయన గెలుపుకు ప్రధాన కారణంగా నిలిచింది.. బై అమెరికాన్, హైర్ అమెరికన్ నినాదమే ట్రంప్ ను అమెరికా అధ్యక్షుడిని చేసింది..

ట్రంప్ గెలిచాక కూడా అదే మాటలు మాట్లాడాడు.. నా చివరి శ్వాస వరకు అమెరికాకు నష్టం కలుగకుండా చూసుకుంటా.. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే ఇస్తా.. మీ కలను వెనక్కు తెస్తా.. మీ సంపదను వెనక్కు తెప్పిస్తా.. అంటూ అమెరికాయే ముందు అని స్పష్టం చేశారు. దీంతో విదేశాలు ఉలిక్కిపడ్డాయి. చైనా, భారత్ లాంటి దేశాలు, వ్యాపారులు అక్కడ పెద్దఎత్తున కంపెనీలు ప్రారంభించాయి. ఉత్పత్తులు విక్రయిస్తున్నాయి. ఇండియా సాఫ్ట్ వేర్ రంగంలో అమెరికాలో అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు ట్రంప్ ప్రకటనతో ఇండియా సహా విదేశాల ఉద్యోగులకు గడ్డు కాలమే. అక్కడి పనులు అక్కడి వారికే నన్న ట్రంప్ నినాదంతో ఇతర దేశాల వారికి ఉపాధి గగనమే.. సో ప్రాంతీయవాదంతో అమెరికా అధ్యక్షుడు అయిన ట్రంప్ .. ఆ దేశాల వారికి మేలు చేస్తున్నట్టే.. కానీ మనలాంటి దేశాలకు అదీ తీవ్రంగా నష్టమే..

To Top

Send this to a friend