ఒక్క ఉద్యమపాట.. వెంకయ్య, బీజేపీ పరువు గంగలో కలిపేసిన పవన్

 

పవన్ లో ఆవేదన ఉంది. ఆగ్రహం ఉంది. ఇచ్చిన మాటను ఎక్కడ నెర్చవేర్చలేకపోతున్నానో అని మధన పడుతున్నాడు. నాడు 2014 ఎన్నికల్లో ప్రజల ముందుకొచ్చి బీజేపీ-టీడీపీ కూటమికి ఓటేస్తే మీ బతుకులు మారుతాయని చెప్పిన పవన్.. నేడు వాటిమీదనే యుద్ధానికి దిగాడు. ఓట్లకోసం ప్రత్యేకహోదా ను ప్రకటించి ఇప్పుడు అవకాశం వాదంతో ఏపీ ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ నేతలకు బుద్ది వచ్చేలా పవన్ రూపొందించిన లేటెస్ట్ పాట దుమ్మురేపుతోంది..

ఈ పాటలో బీజేపీ నేతలు, ముఖ్యం గా వెంకయ్య, బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలను ముందు ఊటంకించారు. వారి ఇచ్చిన హామీలను టీవీల్లో పలికిన మాటలను ప్రస్తావించారు. అనంతరం ప్రత్యేకహోదా కోసం ప్రజలు రెడీ అవ్వండంటూ వీడియోలో సందేశమిచ్చారు.

విశాఖ వేదికగా ఈరోజు జరుగుతున్న ప్రత్యేకహోదా ఆందోళలనకు మద్దతుగా పవన్ ట్వీట్టర్ ద్వారా యుద్ధమే చేస్తున్నారు. ఈ సందర్భంగా వరుస ట్వీట్లతో బీజేపీ-టీడీపీ కూటమికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. జనసేన టీం తాజాగా బీజేపీ నేతలు వెంకయ్య, మరో ఎంపీ చేసిన రీమిక్స్ వీడియో దుమ్మురేపుతోంది. వారిని కడిగిపారేస్తోంది..

పవన్ రూపొందించిన వీడియోను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend