ఒకేరోజు రెండు క్రీడా సంచలనాలు..

-అఫ్రిది రిటైర్, బెన్ స్టోక్స్ కు 14.5 కోట్లు

భారత పర్యటనలో విశేషంగా రాణించిన బెన్ స్టోక్స్ కు అదృష్టం దరిద్రంలా పట్టేసింది. ఈ దెబ్బతో అతడి తలరాతే మారిపోయింది. ఇటీవల భారత పర్యటనలో విశేషంగా రాణించిన ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కు ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికింది.. ఇప్పటివరకు 9.5 కోట్లతో అత్యధిక విదేశీ ప్లేయర్ గా ఐపీఎల్ లో చోటు సంపాదించిన షేన్ వాట్సన్ రికార్డును ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ అధిగమించాడు.  ఈరోజు నిర్వహించిన ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికాడు. ప్రాంచైజీలు రేసుగుర్రం లాంటి స్టోక్స్ కోసం ఎగబడ్డాయి. చివరకు పుణే ప్రాంచైజీ స్టోక్స్ ను 14.5 కోట్లకు చేజిక్కిచ్చుకుంది. దీంతో ఈ సీజన్ తో పాటు ఐపీఎల్ లోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా స్టోక్స్ నిలిచాడు.

మరోవైపు గత ఐపీఎల్ లో పుణె కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహించిన భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సీజన్ లో 14 మ్యాచ్ లు ఆడిన పుణె కేవలం 5 మ్యాచ్ ల్లో గెలిచి అట్టడుగున నిలిచింది. కెప్టెన్ గా కూడా ధోని 12 ఇన్నింగ్స్ లో ఒక హాఫ్ సెంచరీతో 284 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో ధోని నాయకత్వంపై ఆశలు వదులుకున్న ఫుణే ఈ సీజన్ లో ధోనిని కెప్టెన్ తీసివేస్తూ సంచలన నిర్నయం తీసుకుంది. ఈ సీజన్ కు ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ కు బాధ్యతలు అప్పగించింది. ఒకప్పుడు ఐపీఎల్ లో చైన్నై సూపర్ కింగ్స్ ను వరుస విజయాలతో కప్పులు సాధించిపెట్టిన ధోని.. ఇప్పుడు కెప్టెన్ గా కూడా ఉండలేకపోవడం.. పుణే ఫ్రాంచైజీ అతడిని తీసేయడం క్రీడాభిమానులను కలవరపెట్టింది..

To Top

Send this to a friend