ఒకరాత్రికి లక్ష ఇస్తా.. విద్యార్థినులకు మెసేజ్


హైదరాబాద్ నగర శివారులోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో దారుణాలు వెలుగుచూశాయి. విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిన ప్రొఫెసర్లు తమ మాట వినకుంటే ఫెయిల్ చేస్తామని.. ప్రాక్టికల్స్ లో మార్కులు వేయమని.. కామ వాంచ తీరిస్తే లక్ష రూపాయలు, ఇంజనీరింగ్ పట్టా ఇస్తామని విద్యార్థులను బెదిరించారు. కొన్నాళ్లుగా ఈ వేధింపులు కొనసాగుతున్నాయి. దీంతో విద్యార్థులు తమ తోటి విద్యార్థులకు ఆ తర్వాత ఏబీవీపీ నేతలకు.. అటు నుంచి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కామ ప్రొఫెసర్ల ఆగడాలకు చెక్ పడింది..
ప్రొఫెసర్లు విద్యార్థినులకు పంపిన ఫేస్ బుక్, వాట్సాప్ మెసేజ్ లను పోలీసులు ఆధారాలుగా తీసుకున్నారు. వారి నుంచి వివరాలు సేకరించి కీచక కామ ప్రొఫెసర్ల అరెస్ట్ కు రంగం సిద్దం చేశారు. తమ కామ వాంఛలు తీరిస్తే లక్ష రూపాయలతో పాటు ఇంజనీరింగ్ పాస్ చేయిస్తామని.. లేదంటే ప్రాక్టికల్స్ లో ఫెయిల్ చేస్తామని సదరు ప్రొఫెసర్లు బెదిరించినట్టు ఆధారాలతో సహా పోలీసులకు విద్యార్థినులు అందజేశారు. దీంతో కటకటాల పాలు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా.. కీచక ప్రొఫెసర్లు దొరకక తప్పించుకు తిరుగుతున్నారు..

To Top

Send this to a friend