ఐఐటీ వరకు కంప్యూటర్ పట్టని వ్యక్తి గూగుల్ సీఈవో ఎలా అయ్యాడు?

sunder-pichai-apnewsonline

ఒకటో తరగతి నుంచే ఐఐటీ ఫౌండేషన్.. లక్షల్లో ఫీజులు.. బుడ్డ పిల్లల్ని సైతం మానసికంగా హింసించే చదువులు.. ఇవే ఈ తరాన్ని వెంటాడుతున్నాయి. వేధిస్తున్నాయి. స్వేఛ్ఛగా ఎక్కడైతే చదువులు ఉంటాయో అక్కడే అద్బుతాలు జరుగుతాయని ఎన్నో సార్లు నిరూపితమైంది. ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజం గూగుల్ కు సీఈవోగా ఉన్న సుందర్ పిచాయ్ ప్రస్తుతం భారత పర్యటనలో సందడి చేస్తున్నారు.. దాదాపు 23 ఏళ్ల తర్వాత తాను చదువుకున్న ఐఐటీ ఖరగ్ పూర్ లో విద్యార్థులతో ముఖాముఖీ అయ్యాడు. అంతేకాదు.. తాను ఉన్న హాస్టల్ కు వెళ్లి అక్కడి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు..
ఐఐటీ చదువుతున్నప్పుడు తాను అమ్మాయిల హాస్టల్ కు వెళ్లినట్లు గూగుల్ సీఈవో సుందర్ పాతజ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తన భార్య అంజలి కోసమే అలా చేసినట్లు తెలిపారు. రాత్రంతా పుస్తకాలు చదివి తెల్లవారి క్లాసులకు వెళ్లలేకపోయానని తెలిపారు. ఇక ఇంతపెద్ద గూగుల్ సీఈవో అయి కూడా తాను ఐఐటీ వరకు కంప్యూటర్ ను చూడలేదు.. వాడలేదు అని సంచలన విషయం బయటపెట్టాడు.. అసలు మన సామర్థ్యాన్ని లక్ష్యాన్ని ముందు ఉంచుకుంటే ఇంత పెద్ద చదువులు అవసరం లేదని.. ఏకాగ్రత తో ఇష్టపడి చదవితే ఎదగవచ్చని సుందర్ విద్యార్థులకు ఉపదేశమిచ్చారు..

To Top

Send this to a friend