జగిత్యాల గణతంత్ర వేడుకల్లో ప్రజల సాక్శి గా తలవంపులు తెచ్చిన కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్
జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్, డిప్యూటీ కలెక్టర్ ముషరఫ్ అలీలు గణతంత్ర దినోత్సవంలో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది.. జగిత్యాల జిల్లా ఏర్పాటు అనంతరం మొట్ట మొదటి సారిగా 68 వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు జగిత్యాల చారిత్రక ఖిల్లా లో గురువారం ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ ఖిల్లాలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పాదాభివందనం చేస్తున్నానంటూ ప్రసంగం ప్రారంభించడం ప్రజల్లో కలకలం రేపింది.
మరో ఐఏఎస్ అధికారి ముషరఫ్ అలీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత వద్దకువెళ్లి ఆమె పాదాల వద్ద కూర్చుని ముచ్చటించడం పరేడ్ మైదానం లో కూర్చున్న పలువురిని తలవంపులకు గురి చేసింది. అఖిల భారత సర్వీసు అధికారులుగా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వీరు వ్యవహరించిన తీరు జగిత్యాల జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మాయని మచ్చలా మారింది..
