ఎస్బీఐ బాదుడు మొదలైంది..

ఐదు బ్యాంకుల విలీనంతో దేశంలోనే అతిపెద్ద బ్యాంకుగా అవతరించిన ఎస్ బీ.ఐ ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి ఖాతాదారులను బాదేందుకు సిద్ధమైంది. ఖాతాలను సరిగ్గా నిర్వహించని… కనీసం మొత్తం లేని ఖాతాదారుల నుంచి పెనాల్టీ చార్జీలు, సర్వీస్ చార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమైంది. నేటి నుంచి ఇది అమల్లోకి వచ్చింది..

ఎస్.బీ.ఐ ఖాతాదారులు ఇక నుంచి తప్పనిసరిగా తమ ఖాతాలో కనీస మొత్తం ఉంచాల్సిందే.. హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఖాతాలో రూ.5వేల బ్యాలెన్స్, కరీంనగర్, వరంగల్ వంటి సెమీ అర్బన్ పట్టణాల్లో రూ.3వేలు ఖాతాలో ఉంచాలి. ఇక పట్టణాల్లో రూ.2 వేలు, గ్రామీణ ప్రాంత ఎస్.బీ.ఐ బ్యాంకుల్లో రూ.1000 కనీస మొత్తాన్ని ఉంచాలి.

మంత్లీ ఏవరేజ్ బ్యాలెన్స్ లేని ఎస్.బీ.ఐ బ్యాంకు ఖాతాల్లో కనీస మొత్తం లేకుంటే రూ.100 జరిమానా.. సర్వీస్ ట్యాక్స్ వసూలు చేస్తారు. మెట్రో సిటీల్లో కనీస మొత్తం కంటే 75శాతం తక్కువ ఉంటే రూ.100 జరిమానా.. సర్వీస్ ట్యాక్స్, అదే 50శాతం అంతకంటే తక్కువ నిల్వ ఉంటే రూ.50 పెనాల్టీ, సర్వీస్ టాక్స్, గ్రామీణప్రాంతాల్లో రూ.25 జరిమానా సర్వీస్ టాక్స్ విధిస్తారు.

To Top

Send this to a friend