ఎవర్ గ్రీన్ ఫ్రెండ్ షిప్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నటుడు అలీల మధ్య స్నేహం ఈనాటిది కాదు. పవన్ ప్రతి సినిమాలో అలీకి ఓ పాత్ర ఉంటుంది. స్నేహితుడిగా బయట లోపల అలీనే ఉంటాడు. ఎన్నోసార్లు అలీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పవన్ సాయం చేశారనే టాక్ ఉంది. ఇప్పుడు స్నేహితులు పవన్ కాటమరాయుడు సినిమాలో కూడా కలిసి నటిస్తున్నారు. వారిద్దరు సెట్స్ లో సందడి చేసిన వీడియోను యూనిట్ రిలీజ్ చేసింది. సినిమా ప్రమోషన్ లో భాగంగా విడుదలైన ఈ వీడియో వైరల్ లా పాకుతోంది. ఇప్పటికే గంటలో రెండు లక్షల మందికిపైగా చూశారు.

50 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో అలీ , పవన్ ల మధ్య ఎన్నో సీన్లు, ఆకట్టుకుంటున్నాయి. కాటమరాయుడు సినిమాకు పబ్లిసిటీ పెంచే ప్రక్రియలో భాగంగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని సీన్లతో ఈ వీడియోను రూపొందించి విడుదల చేశారు. ఉగాదికి విడుదలయ్యే కాటమరాయుడు సినిమాకు డాలి దర్శకుడు. శరత్ మరార్ నిర్మాత.శృతిహాసన్ హీరోయిన్.. కామరాజు, అజయ్, చైతన్య, శివబాలాజీ పవన్ తమ్ముళ్లుగా నటిస్తున్నారు.

పవన్-అలీల సరదా సరదా సన్నివేశాల వీడియోను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend