ఎల్లో మీడియా ఎఫెక్ట్ : అంత చేసినా.. జగన్ కు మైలేజీ లేదే..?

ఒక్క పొరపాటు.. కాదు.. అది ఎల్లో మీడియాకు దొరికన గ్రహపాటు.. పాపం జగన్ అని అందరూ అనుకుంటున్నారు. ప్రత్యేక హోదా కోసం ఏపీలో ఇప్పుడు ఇద్దరే పోరాడుతున్నారు. అది ఒకరు పవన్ కళ్యాన్.. మరొకరు వైసీపీ అధినేత జగన్.. పవన్.. తెరవెనుక ఉండి.. క్షేత్రస్థాయిలోకి దిగకుండా ట్విట్టర్, విలేకరుల సమావేశాలతో వేడి పుట్టిస్తున్నారు. మరొకరు జగన్.. క్షేత్రస్థాయిలోకి తాను దిగి.. వైసీపీ ఎమ్మెల్యేలను, నాయకులను కార్యక్షేత్రంలోకి దించి ప్రత్యేక హోదా వేడి రగిలించారు. కానీ ఇంత చేసినా జగన్ కు మైలేజ్ దక్కలేదు.. దక్కకుండా చేశారు ప్రత్యర్థి ఎల్లో మీడియా..

ప్రత్యేక హోదా ఆందోళన ఉవ్వెత్తున ఎగిసిన వేళ.. మీడియా ఏం చేయాలి.. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ నిజాలు నిర్భయంగా వెల్లడించారు. ఆందోళన చేస్తున్న యువత, ప్రజలు, ప్రతిపక్షాల వెంట నడవాలి.. కానీ తెలుగు రాష్ట్రాల్లోని మీడియానే డిఫెరెంట్.. పాపం జగన్ .. హోదా ఉద్యమానికి అండగా.. హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చారు. విద్యార్థులతో కలిసి ఉద్యమించాలనుకున్నారు. కానీ ఎయిర్ పోర్టులోనే పోలీసులకు దొరికి పోయారు. ప్ఛ్.. అక్కడే కథ అడ్డం తిరిగింది.. పోలీసులు అడ్డుకున్నారు. వారిపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ‘నేను ప్రతిపక్ష నాయకుడిని.. నన్ను అడ్డగిస్తున్నారు.. అదే ముఖ్యమంత్రిని కూడా ఇలా పట్టుకుంటారా..?.. ప్రతిపక్షాలకు ఒక న్యాయం.. అధికార పార్టీ వాళ్లకు ఒక న్యాయమా..? పోలీసులు మీరు మారాలి..’ అంటూ ఆగ్రహంగా పోలీసులను గద్దించారు.. అగో ఇక్కడే దొరికిపోయారు.. జగన్..

ఎల్లో మీడియా విజృంభించింది. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిని అవుతా.. మీ అంతు చూస్తానని జగన్ అన్నాడని కొన్ని అస్పష్ట మాటలను మార్చి మార్చి వేసి జగన్ సీఎం కాకముందే సీఎం అంటూ బీరాలు పలుకుతున్నాడని మీడియా ఫోకస్ చేసింది. ప్రత్యేక హోదా ఆందోళనను పక్కనపెట్టి జగన్.. అప్పుడే సీఎంగా ఫీలవుతాడని సెటైర్లు వేస్తూ కథనాలు ప్రసారం చేశారు. దీంతో ఈ దెబ్బకు మీడియా లో హోదా అనే బర్నింగ్ ఇష్యూ పక్కకుపోయి.. పాపం జగన్ విలన్ గా మారిపోయారు.. ప్చ్ ఏం చేస్తాం.. ఈ ఎల్లో మీడియా ఉన్నంత కాలం నిజాలు మరుగునపడి.. అనవసర విషయాలు తెరమీదకు వస్తాయి.. అవన్నీ జగన్ కు గ్రహపాటు గా మారి.. ఆయన అధికారానికి దూరమవుతున్నారు..

To Top

Send this to a friend