‘ఎల్లో’ ‘ఎల్లో’ డర్టీ పాలిటిక్స్..


ఏపీ రాజ్యం ఉలికిపడుతోంది. పచ్చపార్టీ నాయకులు బుసలు కొడుతున్నారు. అధికారం అండతో చెలరేగిపోతున్నారు. రాక్షస మూకల వలే ప్రత్యర్థి పార్టీ నాయకులను చావబాదుతున్నారు. ఈ దారుణ మారణకాండకు ఏపీలోని కడప జిల్లా సాక్షిగా నిలుస్తోంది.
స్థానికసంస్థల ఎన్నికల్లో బలం లేకున్నా బరిలోకి దిగిన తెలుగు దేశం పార్టీ కడప జిల్లాలో అరాచకం సృష్టిస్తోంది. వైసీపీకి మద్దతిస్తున్న జడ్పీటీసీలు,కార్పొరేటర్లు,ఎంపీటీసీలను టార్గెట్ చేసి వినని వారి తలలు పగులగొట్టిస్తోంది.వారు ఆస్తులను కొల్లగొడుతున్నారు. విచ్చలవిడిగా డబ్బులు ఎగదోసి వైసీపీ స్థానికసంస్థల సభ్యులను కొనేస్తున్నారు. ఎదురుతిరిగిన వారిపై దాడులకు దిగుతున్నారు. తెలుగు తమ్ముళ్ల అరాచకానికి వైసీపీ నాయకులు అల్లాడిపోతున్నారు. సోమవారం కడప జిల్లాలో వైసీపీ కార్పొరేటర్ పాకా సురేష్ తలను టీడీపీ నాయకుల పగులకొట్టారు..ఆయన పరిస్థితి విషమంగా ఉంది. టీడీపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొడుకు వైసీపీ కార్యకర్త సుబ్బారెడ్డిని కొట్టుకుంటూ ఎత్తుకెళ్లారు.. ముద్దనూరు జడ్పీటీసీ మోటార్ ను ధ్వంసం చేశారు. కొప్పోలి ఎంపీటీసీ పంటను టీడీపీ నాయకులు దోచుకున్నారు.
కడప స్థానికసంస్థల ఎన్నికల్లో మొత్తం 845 ఓట్లు ఉన్నాయి. ఇందులో వైసీపీ నుంచి గెలిచిన వారు 521 మంది ఉన్నారు. దీంతో ఇక్కడ స్థానికసంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయం.. కానీ టీడీపీ పోటీ పెట్టి అందరిని కొనేస్తోంది. మాట వినని వారిని చావబాదుతోంది. ఇలా అరాచకం చేస్తూ గెలవాలనుకుంటున్న పచ్చపార్టీ ఆగడాలు కడప, కర్నూలు జిల్లాలో బాగా శృతిమించిపోయాయి.

To Top

Send this to a friend