ఎరోటిక్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్ ‘రెడ్’

red_38కన్నడలో అఖండ విజయం సాధించిన ‘రెడ్‌’ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో నిర్మిస్తున్నారు యువ నిర్మాత భరత్‌. కామిని, రాహుల్‌, రాజ్‌ ఆర్యన్‌, పృధ్వి ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రాన్ని భరత్‌ పిక్చర్స్‌ పతాకంపై ఆయన తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న ఆలుమగల మధ్య ఓ అపరిచితుడు ప్రవేశించడం వల్ల.. వారి జీవితంలో చోటు చేసుకున్న అనూహ్య సంఘటన సమాహారంగా రూపొందిన ఈ చిత్రం కన్నడలో అసాధారణ విజయం సాధించింది.
నిర్మాత భరత్‌ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రానికి కన్నడలో దర్వకత్వం వహించిన రాజేష్‌మూర్తి ఈ చిత్రాన్ని కన్నడలో నిర్మించడంతోపాటు సంగీతం కూడా సమకూర్చడం విశేషం. ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తూ ప్రేక్షకులకు రసానుభూతిని పంచే ఎరోటిక్‌ మర్డర్‌ మిస్టరీ ‘రెడ్’. కన్నడలో కంటే తెలుగులో ఈ చిత్రం మరింత పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి’ అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: అంజన్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: డా॥శివ వై.ప్రసాద్‌, నిర్మాత: భరత్‌, సంగీతం-దర్శకత్వం: రాజేష్‌మూర్తి.

To Top

Send this to a friend