ఎరక్కపోయి ఇరుక్కున్నారు గంటా..

gantasrinivasarao

ప్రాణ స్నేహితుడైనా.. అన్నాదమ్ములైన డబ్బుల విషయంలోనే తగవులు వచ్చేది.. అందుకే డబ్బుల విషయంలో ఎవరితోనైనా జాగ్రత్తగా ఉండమంటారు పెద్లలు.. ఆ విషయం తెలుసో లేక అధికారంలో ఉన్న ధీమానో ఏమో కానీ ఏపీ మంత్రి గంటా ఎరక్కపోయి ఇరుక్కున్నారు.. దానికి తగిన మూల్యం చెల్లించుకున్నారు.
మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ పట్నం ఇండియన్ బ్యాంకులో దాదాపు 141 కోట్లు రుణం తీసుకున్న ఆయన సన్నిహుతులు ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ ఫ్రా కంపెనీ కి హామీ దారుగా సంతకం చేసి ఉన్నారు. ఇప్పుడా ఆ కంపెనీ, దాన్ని నడిపిస్తున్న వారు ఆ సొమ్మును చెల్లించలేదు. దీంతో హామీ గా పెట్టిన కంపెనీ ఆస్తులతో పాటు మంత్రి గంట సంతకం చేసినందుకు గాను విశాఖలోని ఆయన ఇల్లును, ఒక ఫ్లాటును, అనకాపల్లి, చోడవరాల్లో వ్యవసాయ భూమి, కూర్మన్నపాలెంలో కొంత భూమిని ఇండియన్ బ్యాంకు స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటన విడుదల చేసింది. దీంతో మంత్రి గంట సంతకం పెట్టిన పాపానిని తన ఇళ్లు, ఆస్తులు, భూములు కోల్పోవాల్సి వచ్చింది..

To Top

Send this to a friend