ఎన్టీఆర్ సినిమా : విలన్ చంద్రబాబా..? లక్ష్మీ పార్వతా.?

హీరో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలు సంచలనం రేపాయి. త్వరలోనే ఆయన నాన్న, మాజీ సీఎం ఎన్టీఆర్ మీద సినిమా తీయబోతున్నామని.. ఇందుకోసం ముగ్గురు మేధావులతో కమిటీ వేసి కథ కోసం పరిశోధన చేస్తున్నామని సంచలన విషయాన్ని చెప్పారు బాలయ్య.. ఈ ప్రకటన మొదలు టీడీపీ, ఇతర ఎన్టీఆర్ సన్నిహిత వర్గాల్లో కలకలం మొదలైంది..  ఎన్టీఆర్ 9 నెలల్లోనే తెలుగు దేశం పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చింది మొదలు.. ఆయన రాజకీయ ప్రస్థానం.. అంతకుముందటి సినీ ప్రస్థానం.. రాజకీయాల్లో ఒడిదుడుకులు.. 1996లో ఆయన మరణం వరకు అన్ని అంశాలు ఆ సినిమాలో ఉంటాయని బాలక్రిష్ణ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ పాత్రను బాలయ్యే పోషిస్తాడో లేక మరెవరికైనా ఆ చాన్స్ దుక్కుతుందనే విషయాన్ని మాత్రం బాలక్రిష్ణ స్పష్టం చేయలేదు..

కాగా ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా బాలక్రిష్ణ సినిమా చేస్తాననడంపై ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ సినిమాను వక్రీకరిస్తారని.. సినిమాలో విలన్ గా చంద్రబాబును పెట్టకుంటే తాను కోర్టుకు వెళతానని స్పష్టం చేశారామే.. ఎన్టీఆర్ అధికారాన్ని కూలదోసి గద్దెనెక్కిన చంద్రబాబే విలన్ గా ఉండాలని.. లేకుంటే కోర్టు ద్వారా ఆ సినిమా విడుదల కాకుండా అడ్డుకుంటానని లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు. బాలయ్య సినిమాలో లక్ష్మీపార్వతినే విలన్ గా చూపించబోతున్నట్టు తనకు తెలిసిందని.. దీన్ని ఎంత మాత్రం సహించేది లేదని లక్ష్మీపార్వతి మీడియా ముందుకు వచ్చి స్పష్టం చేశారు.

సీనియర్ నటుడు.. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పిన ఎన్టీఆర్ జీవిత చరిత్ర సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో అందరిలోనూ ఆసక్తి ఉంటుంది.. ఆదరణ ఉంటుంది. ఇలానైనా ఎన్టీఆర్ చరిత్రను భావితరాలకు అందించిన వారు అవుతారు.. అదే సమయంలో కలెక్షన్లతో లాభాలు గడించవచ్చు… చరిత్రకు కొత్త భాష్యం చెప్పవచ్చు.. ఎన్టీఆర్ మరణంపై సందేహాలు తీర్చవచ్చు..  బాలయ్య బావ చంద్రబాబును సచ్చీలుడిగా చూపించి.. లక్ష్మీ పార్వతిని విలన్ చేయడానికి ప్రయత్నిస్తారా..?

ఈ జీవిత చరిత్రలో ఎన్టీఆర్ ని ఎవరు వెెన్నుపోటు పొడిచారో, ఎలా కుర్చీ లాక్కున్నారో…… ఈ సినిమాలో చూపిస్తారో లేదో,

నడిరోడ్డు మీద చెప్పులతో ఎలా కొట్టించారో , అది తల్చుకుని అన్నగారు ఎలా కుళ్ళికుళ్ళి ఏడ్చారో…… ఈ సినిమాలో చూపిస్తారో లేదో,

 

చివరిదశలో తన కుటుంబ సభ్యులు ఆయన్ని ఎంత క్షోభ పెట్టారో , ఎందుకు చనిపోయారో , ఎలాంటి మరణం వచ్చిందో , ఆయన ఆత్మ శాంతించిందని చూపిస్తారో, శాంతించలేదని….. చూపిస్తారో….

ఇలా ఇప్పటినుంచే చాలా ఆలోచనలు వచ్చేస్తున్నాయ్…. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్దో, ఈ సినిమా ముందుకు సాగుతుందా లేదా అన్నది వేచిచూడాల్సిందే.

To Top

Send this to a friend