ఎన్టీఆర్ వర్థంతిలో రికార్డింగ్ డ్యాన్స్… వంతపాడిన అధ్యక్షుడు

ఏ కార్యక్రమానికి ఏ డప్పు వాయించాలో కూడా టీడీపీ తమ్ముళ్లకు అర్థం కావడం లేదు. ఈవెంట్ ఏదైనా సరే ఎంజాయ్‌మెంట్‌ను కోరుకుంటున్నారు. ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమాన్ని కూడా ఇందుకు వదలలేదు. టీడీపీ వ్యవస్థాపకుడు కన్నుమూసిన రోజు ఆయన్ను తలుచుకుని బాధపడాల్సిందిపోయి అమ్మాయిలతో గంతులేశారు. గుంటూరు జిల్లా వినుకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజ్‌ ఆవరణలోనే ఈ తంతు జరిపారు. ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమం అంటూ వేదికపై రాసి మరీ అమ్మాయిలతో నర్తించారు.

రికార్డింగ్ డ్యాన్స్ చేసే అమ్మాయిలు స్టేజ్‌ మీద స్టెప్పులేస్తుంటే టీడీపీ నేతలంతా వేదికపై కూర్చుని ఆస్వాదించారు. కార్యక్రమానికి గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు కూడా హాజరై రికార్డింగ్ డ్యాన్స్‌ను ఉత్సాహపరిచారు. ఎన్టీఆర్‌ వర్థంతి రోజు ఇలా ఆడవాళ్లను ఆటబొమ్మలుగా మార్చి, వారు డ్యాన్సులేస్తుంటే చూస్తూ ఎంజాయ్ చేయడంపై టీడీపీ కార్యకర్తలే అసంతృప్తి వ్యక్తం చేశారు.

To Top

Send this to a friend