ఎన్టీఆర్ కు అమ్మగా పనికిరానా?:హేమ

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న నటి హేమ దర్శకుడు పూరి జగన్నాథ్ పై శివాలెత్తారు. తెలుగులో ఇంత మంచి నటులుండగా పూరి జగన్నాథ్ పక్కరాష్ట్రాల నుంచి నటులను తీసుకొచ్చి తెలుగులో నటింపచేస్తున్నారని.. దీన్నే తామంతా ఖండిస్తున్నామని హేమ వ్యాఖ్యానించారు. ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పరభాష చిత్రాల ను తెచ్చి తెలుగు లో నటింప చేస్తున్న దర్శకులు, పరభాష హీరోయిన్ల కామెంట్లపై విరుచుకుపడ్డారు..

తెలుగులో చాలా మంచి నటులున్నారని.. ఇక్కడి వాళ్లనెందుకు తీసుకోరని మండిపడ్డారు.‘ నాకెందుకు తల్లి క్యారెక్టర్లు ఇవ్వరని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కు అమ్మగా నటించే అవకాశంగా నాకు ఇవ్వలేదు.. నాకు 25 ఏళ్ల అనుభవం ఉంది. అయినా తీసుకోవడం లేదని ’ హేమ ప్రశ్నించారు.

ఇక్కడి అగ్ర నటులు, నిర్మాతలు తమ వారసులను మాత్రం సినిమాల్లోకి తీసుకొస్తున్నారు.. అదే ఇతర నటుల విషయంలో మాత్రం పక్కరాష్ట్రాల నుంచి తెస్తున్నారని హేమ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ జరుగుతున్నా ఇప్పటికీ కూడా పరభాష నటులకే తెలుగులో అవకాశాలు రావడాన్ని తాను ప్రశ్నిస్తున్నానని హేమ ఆగ్రహం వ్యక్తం చేశారు.

To Top

Send this to a friend