ఎక్కడ తగ్గాలో తెలుసు.. అదీ కేసీఆర్ అంటే.

రాజకీయం.. పరిపాలన ఈ రెండింటిలో ప్రస్తుతానికి కేసీఆర్ ను ఢీకొట్టే మగాడు లేదు. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినవారు సీఎం కేసీఆర్.. అందుకే ఉవ్వెత్తున ఎగిసిన నిరసనను కేవలం ఒక్క కలం పోటు తో రద్దు చేసి ఎవ్వరైతే తనపై కారాలు మిరియాలు నూరారో వారితోనే క్షీరాభిషేకాలు చేయించుకున్నారు.. అదే మరీ రాజకీయం అంటే.. ప్రజల మనసులు, అభిరుచులు.. వారి కష్టసుఖాలు తెలిసినవారే నాయకులవుతారు.. ఇలాంటి విషయంలో కేసీఆర్ ముందుంటారు.. ఇంతకీ విషయంలోకి వస్తే..
నిన్న మనం ఏపీన్యూస్ ఆన్ లైన్ లో ఓ కథనం ప్రచురించాం.. ఆ కథనంలో ఉన్నదేంటంటే.. ‘‘తెలంగాణలో గురుకులాల్లో దాదాపు 7వేల పోస్టులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో నిబంధనలకు నిరుద్యోగుల పాలిట ఆశనిపాతంలా మారాయి. టీజీటీ, పీజీటీ పోస్టులకు అర్హత సాధించాలంటే డిగ్రీలో 60శాతం మార్కులు ఉండాలని.. కనీసం మూడేళ్ల బోధనానుభవం ఉండాలన్న నిబంధనతో వేలమంది నిరుద్యోగులు అవకాశం కోల్పోతున్నారు. దీనిపై తీవ్రస్థాయిలో తెలంగాణలో నిరసన వ్యక్తం అవుతోంది. డిగ్రీ, బీఈడీ, టెట్ కూడా ఎన్ సీఆర్ టీఈ నిబంధనల ప్రకారం 45 శాతం మార్కులు వస్తే అర్హత.. కానీ గురుకుల పోస్టులకు నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం 60శాతం పెట్టడం నిరుద్యోగలోకం ఆందోళనలకు, హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతోంది. ’’ ఈ విషయంపై ఆందోళనలను వెంటనే గ్రహించిన కేసీఆర్ అలెర్ట్ అయ్యారు. పరిస్థితి చేయదాటకముందే తానే దిగివచ్చారు. టీఎస్పీఎస్సీ ఇచ్చిన ఈ కఠిన నిబంధనలను తొలిగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు 60శాతం మార్కుల నిబంధనను తొలగించారు. అంతేకాదు.. మూడేళ్ల ఖచ్చిత బోధానుభవం కూడా తొలగించారు.. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్సీఆర్టీఈ) మార్గదర్శకాలనే అనుసరించాలని.. దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని నిరుద్యోగులకు ఉపశమనం కల్పించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు రంగంలోకి దిగి వెంటనే ప్రస్తుతానికి దరఖాస్తుల స్వీకరణను వాయిదా వేశారు. త్వరలోనే నిబంధనలు మార్చి మళ్లీ దరఖాస్తుల తేదిని ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది..
కేసీఆర్ మొదటి నుంచి అంతే.. ఏదైనా ఒక అంశాన్ని అది మంచిదైనా.. చెడ్డదైనా.. ముందు దాన్ని ప్రజల్లోకి తీసుకెళతారు.. మంచి ఫలితాలు వస్తే కొనసాగిస్తారు. నెగెటివ్ వస్తే.. వెంటనే స్పందించి దాన్ని రద్దు చేసి మొత్తం క్రెడిట్ కొట్టేస్తారు. గతంలో వీధివిధీన కల్లుకాంపౌండ్ లు ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. దీనిపై మహిళాలోకం, ప్రతిపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. ఏకంగా సీఎం ఇంటి ముందు మహిళా సంఘాలు ఆందోళనకు దిగితే వారిని లోపలకి రమ్మని.. కల్లు కాంపౌండ్ లు పెట్టే ఆలోచనే లేదని.. విరమించుకుంటున్నట్టు చెప్పి తిట్టిన వారి నోటితే ప్రశంసలు కురిపించుకున్నారు కేసీఆర్.. ఇలా ఒక్కటేమిటీ..? చాలా నిర్ణయాలను అగ్గిరాజేసి ఆర్పేసి హీరో అయిన సందర్భాలు కేసీఆర్ చాలా ఉన్నాయి.. దటీజ్ కేసీఆర్..

To Top

Send this to a friend