ఎంపీ కవిత మాటల్లో లేని చంద్రబాబు!

కేసీఆర్ మాటల మరాఠీ .. ఆయన కొడుకు కేటీఆర్, కూతురు కేసీఆర్ అంతే.. అందుకే ఏపీలోని అమరావతికి వచ్చినా కవిత స్టామినా తగ్గలేదు. ఏపీలోకూడా అద్భుతంగా ప్రసంగించి అందరితో శభాష్ అనిపించుకున్నారు.. తెలంగాణ ఆడపడుచు అదీ ఆంధ్ర గడ్డమీద జై ఆంధ్ర అంటూ వ్యాఖ్యలు చేసి సభికుల హర్షధ్వానాలు అందుకోవడం విశేషం..
అమరావతిలో జరుగుతున్న ఉమెన్స్ పార్లమెంట్ కు గెస్ట్ గా వెళ్ళిన కవిత అందరిని ఆకట్టుకున్నారు. అమరావతిలో అడుగు పెట్టిన మరుక్షణం నుంచి ఆమే సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్ అయ్యారు.దేశ విదేశాల నుంచి ఎందరో మహిళలు వచ్చినప్పటికి తెలంగాణ ఆడపడుచే అసలు సిసలు అతిధిగా కనిపించారు.మీడియా అయితే కవిత ఇంటర్వ్యూల కోసం ఎగబడింది.ఉద్యమ సమయంలో తిట్టిన ఆ నోళ్లే ఇప్పడు పొగుడుతు కవితకు పట్టం కట్టడం విశేషం. ప్రసంగం ప్రారంభంలో కవిత చేసిన వ్యాఖ్యలు కూడా ఆంధ్రుల మనసును దోచాయి.ఎప్పుడు జై తెలంగాణ అనే ఆమె జై ఆంధ్రప్రదేశ్ అంటు తన మనసు విశాలమని నిరూపించుకున్నారు. మనమంతా తెలుగు వారమన్న భావనను కవిత అమరావతి వేదికగా మరో సారి చాటారు. నెల్లూరు జిల్లాకు చెందిన రోశమ్మ స్పూర్తితో మహిళలు నాయకత్వ పటిమను పెంచుకోవాలని ఆమె చెప్పుకొచ్చారు. గురజాడ చాటిన ఆదర్శ సమాజాన్ని అందిపుచ్చుకోవాలని కవిత స్పష్టం చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపైన ఆమె ప్రశంసలు గుప్పించడం విశేషం. ఇక్కడికి రావడం తనకెంతో ఆనందంగా ఉందన్న నిజామాబాద్ ఎం.పి అలాంటి అమరావతిలా వైభవంతో తులతూగాలని ఆకాంక్షించారు. విజయవాడ రోడ్లు అందంగా తయారయ్యాయని కవిత చెప్పుకొచ్చారు.అయితే ఇంత ఘనంగా ఉమెన్స్ పార్లమెంటు ను నిర్వహిస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరు కూడా ఆమె ప్రస్తావించకపోవడం మాత్రం అక్కడి వారిని కొందరిని నిరాశ పర్చిందంట

To Top

Send this to a friend