ఉద్దానం బాధితుల ఘోష – చంద్రబాబుతో పోరుకు జనసేనాని..!

uddanam-pawankalyan

ఉద్దానం బాధితుల ఘోష.. ఇప్పుడు తెలుగు ప్రజలకు చేరువయ్యింది. జనసేనాని వారి కష్టాలను, కన్నీళ్లను ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇన్నేల్లుగా కిడ్నీ బాధితుల కష్టాలు పట్టని ప్రభుత్వాన్ని పవన్ కడిగిపారేశాడు. పాలకుల అసమర్ధతను ఎత్తిచూపాడు.. చంద్రబాబు ప్రభుత్వం చర్య తీసుకోకపోతే పోరుబాటకు సై అన్నాడు..
పుష్కరాలు, రాజధానికి కోట్లు ఖర్చు పెడుతున్న చంద్రబాబు.. కిడ్నీ వ్యాధితో వేల మంది చనిపోతున్నా పట్టించుకోరా అని పవన్ నిలదీశాడు.. సమస్యపై జనసేన కమిటీ రూపొందించి 15రోజుల్లో సీఎంకు నివేదిక ఇస్తామని.. అయినా పట్టించుకోకపోతే ఉద్యమిస్తామని పవన్ సీఎం చంద్రబాబుపై సమరశంఖం పూరించారు.
ఉద్దానం బాధితులతో సమావేశమైన పవన్ వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు.. కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్న వైద్యఆరోగ్యశాఖ మంత్రి కామినేనిపై పవన్ విరుచుకుపడ్డారు. వ్యాధి ప్రభావం, బాధితుల మరణాలు లెక్కలోకి తీసుకోకుండా.. సమస్యకు పరిష్కారం చూపకుండా డయాలసిస్ చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా అని ప్రశ్నించారు. నోట్ల రద్దుతో వచ్చిన వేల కోట్లు కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు తింటున్నాయా అని పవన్ ప్రశ్నించారు..
మొత్తంగా ఉద్దానంను ఉద్దరించేందుకు బరిలోకి దిగిన పవన్ అనుకున్నది సాధించారు. వారి కష్టాలను పాలకులు వారి పట్ల చూపిస్తున్న అశ్రద్ధను ఏకిపారేశారు. ప్రభుత్వం కళ్లు తెరిస్తే ఉద్దానం బాధితుల కష్టాలు తీరుతాయి. లేదంటే.. ఏపీలో చంద్రబాబుపై పవన్ పోరాటం.. మీరుతుంది..

To Top

Send this to a friend