ఉడుకు నెత్తురు ఉప్పెనవ్వాలంటే పవన్ కు ఇది చాలదు..

pawanfans-apnewsonline

2001 నుంచి తెలంగాణ కోసం పోరాడుతున్న టీఆర్ఎస్ ఏ ఎన్నికల్లో కూడా పూర్తిస్థాయి విజయాన్ని దక్కించుకోలేదు. తెలంగాణ కోసం అంత పోరాడిన టీఆర్ఎస్ అప్పట్లో గెలవలేదు. ఎందుకు కారణమేంటి అంటే ఆ పార్టీకి కేసీఆర్ తప్ప క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు, పార్టీ సంస్థాగత నిర్మాణం లేకపోవడమే.. అందుకే అది గుర్తించిన కేసీఆర్ తెలంగాణ ఏర్పాటు తర్వాత పెద్ద ఎత్తున కాంగ్రెస్, టీడీపీ నాయకులను చేర్చుకొని పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకొచ్చారు.
అందుకే ఇప్పుడు రాజకీయాల్లో ఆవేశం, సెంటిమెంట్, ఆదరణ ఉన్న కూడా క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం లేకపోతే పవన్ లాంటి ఉడుకు నెత్తురు రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలవడం కష్టమే.. పవన్ కు ఇచ్చాపురం, అనంతపురం, అమరావతి, తిరుపతి ఇలా ఎక్కడికి వెళ్లినా జనం నీరాజనం పడుతున్నారు. అప్పట్లో తిరుపతిలో నిర్వహించిన చిరంజీవి పార్టీ బహిరంగ సభకు కూడా లక్షల మంది వచ్చారు. కానీ ఓట్ల రూపంలోకి మార్చుకోవడం విఫలమయ్యారు. అందుకే పార్టీ నిర్మాణం, కార్యకర్తల బలం లేనిదే.. ఎంతమంది వచ్చినా ఆ పార్టీ ప్రజల్లో నిలబడదు..

ఇక పవన్ గుర్తించాల్సిన మూడో విషయం.. ప్రచారం.. తమకు అనుకూల మీడియా, పత్రికలు లేనిదే ఏ పార్టీ కూడా అధికారాన్ని పొందలేదన్నది మనం కొన్నేళ్లుగా పరిశీలిస్తున్న అంశం.. చంద్రబాబుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, పలు మీడియా చానాళ్ల సపోర్టు ఉంది.. ఇక జగన్ కు సాక్షి మీడియా సపోర్టు ఉంది.. కాంగ్రెస్ కు సైతం అనుకూల మీడియా ఉంది. అందుకే పవన్ ఈ విషయాన్ని అవగతం చేసుకునే చానల్ లేదా పత్రికను తీసుకురావాలని అప్పట్లో సూచించారు. కానీ ఆర్థిక భారంతో పవన్ వెనకడుగు వేశారు. ఒక పార్టీగా రాజకీయాల్లో నిలబడాలంటే మీడియా సపోర్టు అవసరం .. అప్పుడు పవన్ పర్యటనలు పతాకశీర్షికన అచ్చు అవుతాయి. లేదంటే లోపలి పేజీల్లో చిన్నవార్తగా మిగిలిపోతాయి. అందుకే తన అనుకూల మీడియాను సృష్టించుకోవడం.. పార్టీని నిర్మించడం.. మంచి నాయకుల్ని ఎంచుకోవడం పవన్ కు ముందున్న కర్తవ్యం.. ఆ విషయాన్ని గుర్తించి పవన్ ముందడుగు వేస్తే ఏపీలో మూడో బలమైన పార్టీగా ఎదగవచ్చు.. లేదంటే అన్న చిరంజీవిలా ఉవ్వెత్తున వచ్చి ఊసురుమనిపించవచ్చు..

To Top

Send this to a friend