ఉగాదికి ‘కాటమరాయుడు..’

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. పవన్ కొత్త చిత్రం కాటమరాయుడు విడుదల తేదిని చిత్రబృందం రిలీజ్ చేసింది. మార్చి 10 కల్లా షూటింగ్ పూర్తి చేసి నిర్మాణాంతర కార్యక్రమాలు నిర్వహిస్తామని.. మార్చి 24న గానీ , ఉగాది కానుకగా కానీ కాటమరాయుడును విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. అంతేకాదు పవన్, శృతిహాసన్ ల కొబ్బరితోటలోని ఒక ఫొటోను విడుదల చేసి అభిమానులకు కనువిందు చేసింది..
పవన్ కళ్యాణ్ కథనాయకుడిగా కిశోర్ కుమార్ పార్థసాని దర్శకత్వంలో కాటమరాయుడు రూపొందుతోంది. శృతిహాసన్ హీరోయిన్. శరత్ మరార్ నిర్మాత. ఈరోజే పవన్ అమెరికా పర్యటన ముగించుకొని రావడంతో షూటింగ్ మొదలు కాబోతోంది. ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశలో ఉంది. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రం టీజర్ కు మాంచి రెస్పాన్స్ వచ్చింది. పవన్ వీరాభిమాని హీరో నితిన్ తెలంగాణ హక్కుల్ని సొంతం చేసుకున్నారు. దాదాపు 20 కోట్లకు పైగా నైజాం హక్కుల్ని నితిన్ సొంతం చేసుకున్నట్టు తెలిసింది. చిత్రం విడుదల కాకముందే సినిమాకు ఏపీ, తెలంగాణల్లో కలిపి దాదాపు 50 కోట్లకు పైగా అమ్ముడుపోయిందని సమాచారం. దీంతో పవన్ స్టామినా మరోసారి రుజువైంది..

To Top

Send this to a friend