ఈ సిద్దూ నిర్ణయం చూసి అందరూ షాక్ అవుతున్నారు..?

ఎవరైనా అధికార పార్టీవైపు అడుగులు వేస్తారు.? ప్రతిపక్షంలోని పార్టీల జోలికే వెళ్లరు.. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది.. క్రికెటర్, మాజీ ఎంపీ అయిన సిద్దూ అధికార బీజేపీని వదిలేశాడు.. కొద్దిరోజులుగా స్వతంత్ర పార్టీ పెట్టాలనుకుంటున్నాడని వార్తలు వెలువడ్డాయి. కేజ్రీవాల్ ఆప్ పార్టీ బాధ్యతలు అప్పగిస్తాడన్న ప్రచారం జరిగింది. కానీ వీటన్నింటిని తుత్తునియలు చేస్తూ ఎవ్వరూ ఊహించని విధంగా సిద్దూ కాంగ్రెస్ పంచన చేరారు. రాహుల్ విదేశాలనుంచి వచ్చాక లేటెస్ట్ గా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

క్రికెటర్ సిద్దూను బీజేపీ కావాలనే వదిలించుకుంది.. అరుణ్ జైట్లీ అమృత్ సర్ సీటును ఆశించి అక్కడినుంచి ఎంపీగా పోటీచేశారు. అంతకుముందు ఆ సిట్టింగ్ స్థానం సిద్దూదే.. సిద్దూను వేరే చోట పోటీచేయమని బీజేపీ కోరింది. కానీ సిద్దూ బీజేపీ అవమానాన్ని భరించి కొద్దిరోజులు మిన్నకుండిపోయారు. ఆ తరువాత పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో సిద్దూను కాదని పంజాబ్ పగ్గాలు వేరొకరికి అప్పగించింది బీజేపీ అధిష్టానం.. ఇది మండి బీజేపీనుంచి బయటకొచ్చారు సిద్దూ.. ఆ తరువాత ఆప్ లో చేరి సీఎం అవుతారని ఆశించారు. కానీ చేరలేదు. చివరకు కునారిల్లుతున్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీకి పంజాబ్ లో అంతగా బలం లేదు.. అయినా సిద్దూ ఇలా ఓడిపోయే పార్టీలో చేరి ఏ మేరకు విజయవంతం అవుతాడో వేచిచూడాల్సిందే..

To Top

Send this to a friend