ఈ సర్వేలో మీడియా గురించి నమ్మలేని నిజాలు..

తెలుగులో ఉన్న నాలుగు ప్రధాన పత్రికలు నిష్పక్ష పాతంగా ఉన్నాయా..? అంటే ఎవ్వరూ స్పష్టంగా సమాధానం చెప్పలేని పరిస్థితి.. ఎందుకంటే తెలుగులోని ప్రధాన నాలుగు పత్రికలు ఆయా పార్టీలకు వంతపాడుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదని సగటు పాఠకుడిని అడిగినా చెబుతారు. పార్టీలే పత్రికలు పెట్టిన ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇక నీతి, నిజాయితీ గల వార్తలు ఎలా వస్తాయని కొందరు పత్రికాభిమానులు వాపోతుంటారు. అది నిజమే.. పార్టీ ఉందంటే.. వారి పనులు , కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లాలి.. దానికి మీడియా సాధనం.. అందుకే పార్టీ పుట్టకముందే పత్రికలను సపోర్టుగా మార్చుకుంటున్నారు నాయకులు.. ఇప్పటికీ చాలా మంది రాజకీయ నాయకులు పత్రికల్లో పెట్టుబడులుగా పెట్టి వాటి మద్దతు పొందుతున్నారు. ఈ తంతు ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా చోటుచేసుకుంది. జాతీయ పత్రికలు కాంగ్రెస్, బీజేపీలకు కొమ్ముకాస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఇండియాలో వాస్తవాలు బయటపడే మీడియా ఉందంటే అది ప్రింట్, ఎలక్రానిక్ మీడియా.. కాదు.. కేవలం సోషల్ మీడియానే.. ఫేస్ బుక్, వాట్సాప్ లలోనే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. జనాభిప్రాయం కుండబద్దలు కొడుతున్నారు. ఇప్పుడు దేశంలో మీడియా విశ్వసనీయత చాలా తగ్గిందని ఓ సర్వేలో తేలింది..

దాదాపు 38 దేశాల్లో మీడియా వ్యాపారంలో ఉన్న ఎడ్ మన్ ట్రస్టు వరల్డ్ ఎకానమిక్ ఫోరం ఈ సర్వే చేసింది. మీడియా విశ్వసనీయ ఏ దేశంలో దారుణంగా ఉందో సర్వే చేసింది. ఇందులో సిగ్గుపడే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచంలోనే అత్యంత తక్కువ విశ్వసనీయ గల మీడియా ఏదంటే అది మొదటి స్థానం ఆస్ట్రేలియా మీడియానట.. రెండో స్థానంలో భారత మీడియా ఉందట.. మూడో స్థానంలో ఐర్ ల్యాండ్ మీడియా ఉంది.. ఇలా భారత్ మీడియా ఢొల్లతనాన్ని సర్వే నిగ్గుతేల్చింది. టీఆర్పీ రేటింగ్, సర్క్యూలేషన్, పార్టీలకు కొమ్ముకాసే మీడియా ఉన్నంత కాలం భారత్ లోని మీడియాకు విశ్వసనీయత అనేది ఎప్పటికీ ఎండమావేనని ఈ సర్వే తేల్చింది..

ఆ సర్వే రిపోర్టును కింద చూడొచ్చు..

To Top

Send this to a friend