ఈ నెల 16న విడుద‌ల‌ `చిన్నారి`…

img_0048-1
ప్ర‌ముఖ సౌత్ ఇండియ‌న్ స్టార్ ఉపేంద్ర స‌తీమ‌ణి ప్రియాంక కీల‌క పాత్ర‌లో న‌టించిన చిత్రం క‌న్న‌డ చిత్రం `మ‌మ్మీ`. తెలుగులో `చిన్నారి` పేరుతో ఈ నెల 16న విడుద‌ల కానుంది. గ‌త‌వారం క‌న్న‌డ‌లో విడుద‌లైన ఈ చిత్రం సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. ఇంకా హౌస్‌ఫుల్‌గా సాగుతోంది.  బేబి యులీనా పార్థ‌వి, ఐశ్వ‌ర్య‌, మ‌ధుసూద‌న్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రాన్ని తెలుగులో కె.ఆర్‌.కె. ప్రొడ‌క్ష‌న్స్, ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  కె. ర‌వికుమార్‌, ఎం.ఎం.ఆర్ నిర్మాత‌లు. తెలుగు, క‌న్న‌డ‌లో ఏక‌కాలంలో రూపొందించారు.  లోహిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.
ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ “ నాకు ద‌ర్శ‌కుడిగా  తొలి చిత్ర‌మిది. హార‌ర్ జోన‌ర్‌లో చాలా డిఫ‌రెంట్‌గా ట్రై చేశాం. త‌ల్లీకూతురు సెంటిమెంట్ కూడా ఉంటుంది. సినిమా మొత్తం పూర్త‌యింది. ఇటీవ‌లే క‌న్న‌డ‌లో విడుద‌లై అమిత‌మైన ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతోంది. ఇటీవ‌ల విడుద‌లైన తెలుగు టీజ‌ర్‌ గ్రిప్పింగ్‌గా, స్టైలిష్‌గా  ఉంద‌ని చాలా మంది చెబుతున్నారు.  వేణు కెమెరా ప‌నిత‌నం, ర‌విచంద్ర‌కుమార్ ఎడిటింగ్ తెలుగు ప్రేక్ష‌కుల‌నూ మెప్పిస్తాయి. అజినీష్ లోక్‌నాథ్ మంచి సంగీతం చేశారు“ అని చెప్పారు.
 నిర్మాత‌లు మాట్లాడుతూ “హార‌ర్ చిత్ర‌మిది. చైల్డ్ సెంటిమెంట్‌కు ప్రాధాన్య‌త ఉంటుంది. గోవా నేప‌థ్యంలో క‌థ జ‌రుగుతుంది.  షూటింగ్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌య్యాయి. `రంగి త‌రంగి`కి సంగీతం చేసిన అజినీష్ లోక్‌నాథ్ చ‌క్క‌టి బాణీల‌ను ఇచ్చారు. క‌న్న‌డ‌లో టాప్‌ కెమెరామెన్ వేణు ఫోటోగ్ర‌ఫీ చేశారు.  హాలీవుడ్ స్టైల్ టేకింగ్‌, ఆర్ .ఆర్ మెప్పిస్తాయి. క‌న్న‌డ‌లో గొప్ప విజ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో ఈ నెల 16న‌ విడుద‌ల చేస్తాం“ అని తెలిపారు.
To Top

Send this to a friend