ఈ దెబ్బతో చంద్రబాబు ఎక్కడికో ఎళ్లిపోతాడు…

chandrababu-apnewsonlinein

హైటెక్ బాబు అంటే ఏంటో అనుకున్నాం కానీ.. ఏపీలో కొన్ని విషయాల్లో తేలిపోయినా టెక్నాలజీ సంబంధిత విషయంలో బాబు మేటి అని మరోసారి నిరూపించుకున్నారు.. ఇప్పటికే కేంద్రం సాయంతో ఏపీలో ప్రతిపల్లెకు కరెంట్ అంటూ విద్యుత్ అందించి విజయం సాధించారు. ఇప్పుడు అవే పల్లెలకు సాంకేతిక ఫలాలు అందించడంలో పురోగతి సాధించారు. చంద్రబాబు ప్రకటించిన ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కార్యక్రమం ఏపీ లో ప్రారంభమైంది.. అమరావతి శివారు మోరె గ్రామంలో కంప్యూటర్, టీవీ, ఫోన్ సేవలను ఏకకాలంలో కేవలం 149 అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పేదలు, మధ్యతరగతి ఎవరైనా సరే కేవలం 149 చెల్లిస్తే నిరంతరాయంగా టీవీ, ఇంటర్నెట్, టెలిఫోన్ సేవలను పొందవచ్చు. కేంద్రం సాయంతో ఏపీ ప్రభుత్వం అమలు చేసిన ఈ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ఏపీలో అమలు కావడంతో ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. తెలంగాణలో కూడా కేటీఆర్ ఈ పథకం ప్రకటించినా ఇంతవరకు అతీగతీ లేదు. కానీ చంద్రబాబు మాత్రం రెండున్నర ఏళ్లలోనే ఇంటర్నెట్, టీవీ సేవలను ప్రజల దరికి చేర్చి ఔరా అనిపించారు. ఎంతైనా హైటెక్ బాబు టెక్నాలజీ విషయంలో మేరునగధీరుడే..

To Top

Send this to a friend