ఈ ఒక్క మెగా హీరో నిలబడాలి..


మెగా హీరోలందరూ ఫుల్ ఫాంలో ఉన్నారు .. ఒక్క వరుణ్ తేజ్ తప్ప.. వరుణ్ తేజ్ తీసిన లేటెస్ట్ రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి. దీంతో తన కొడుకును ఇండస్ట్రీలో ఎలా నిలబెట్టాలో తెలియక మెగా బ్రదర్ నాగబాబు తీవ్ర ఆందోళనగా ఉండి గడ్డెం పెంచేస్తున్నాడు. అన్నీ హంగులు ఉన్నా కూడా వరుణ్ తేజ్ హీరోగా నిలబడకపోయేసరికి ఏం చేయాలో పాలుపోవడం లేదట నాగబాబుకు..

వరుణ్ తేజ్ మొదట క్లాస్ హీరోగా పరిచయమయ్యాడు. ముకుందా సినిమాతో లవర్ బాయ్ గా అలరించాడు. అనంతరం పూరి చేతిలో పడి మాస్ హీరోగా ఫెయిల్ అయ్యాడు. మళ్లీ శ్రీనువైట్ల చేతిలో పడి ఫ్యామిలీ, లవ్ డ్రామాకు బలి అయ్యాడు. పూరి, శ్రీనువైట్ల ఇద్దరు ఫేమస్ దర్శకులే అయినా కూడా వరుణ్ తేజ్ కు హిట్ ఇవ్వలేకపోయారు. దీంతో ఇప్పుడు వరుణ్ తన తరువాతి సినిమాపైనే కొండంత ఆశలు పెంచుకున్నాడు.

వరుణ్ తేజ్ తన తరువాతి చిత్రానికి దిల్ రాజు నిర్మాత. మంచి టేస్ట్ ఉన్న నిర్మాత కావడం.. మెగాహీరోలు అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్ ను నిలబెట్టిన దిల్ రాజు ఇప్పుడు వరుణ్ తేజ్ ను నిలబెట్టే పనిలో ఉన్నాడు. కానీ దిల్ రాజు నిర్మాణంలో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తుండడం కొంత అనుమానంగా మారింది. శేఖర్ మేనియా ఇప్పుడు టాలీవుడ్ లో లేదు. ఎప్పుడో హ్యాపీడేస్ తరువాత ఆయన చిత్రాలేవీ అంతగా ఆడడం లేదు. దీంతో దిల్ రాజు నిర్మాతగా ఏ కథను ఎంచుకున్నారో అది శేఖర్ కమ్ముల సరిగ్గా ప్రజెంట్ చేస్తారో లేదో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

To Top

Send this to a friend