ఈవీఎం వద్దు.. బ్యాలెట్ ముద్దా..?


మోడీ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింది.. అందుకే ఇఫ్పుడు కేజ్రీవాల్ కు మతిపోయింది.. ఆయనో కొత్త సిద్దాంతం తీసుకువచ్చాడు. అదేంటంటే.. ప్రపంచంలో అగ్రరాజ్యం లాంటి అమెరికా సైతం పేపర్ బ్యాలెట్ ద్వారానే ఎన్నికలను నిర్వహిస్తోందని.. మన దేశంలో మాత్రమే ఈవీఎం మిషన్లతో నిర్వహించి అధికారపార్టీలు మాయ చేసి గెలుస్తున్నాయని ఆరోపించారు. ఈ ఆరోపణలు ఈయనే కాదు.. బీఎస్పీ అధినేత్రి మాయవతి కూడా యూపీ ఎన్నికల్లో ఈవీఎం టాంపరింగ్ జరిగిందనే అనుమానాలు వ్యక్తం చేశారు.

ఓడిపోయిన బాధలో చేశారోలేక ఏమో కానీ ఈ ఆరోపణలపై సర్వత్రా చర్చ నడుస్తోంది.. ఇదే కేజ్రీవాల్ గడిచిన ఢిల్లీ అసెంబ్లీలో ఇవే ఈవీఎంల మీద గెలిచారనే విషయాన్ని మరిచిపోయారు. అప్పుడు ఢిల్లీలో మూడంటే మూడు సీట్లు సాధించి బీజేపీ పార్టీ దారుణ పరాభవాన్ని పొందింది. గుణపాఠం నేర్చుకొని యూపీలో విజయబావుటా ఎగురవేసింది. ఆ గుణపాఠాలు నేర్చుకోలేదు కనుకే కేజ్రీవాల్ పంజాబ్ లో చేతిదాక వచ్చిన అధికారాన్ని అసంబద్ధ నిర్ణయాలతో చేజేతులా చేజార్చుకున్నాడు.

విజయం వస్తే అంత తన క్రెడిట్ అని ఢిల్లీ ఎన్నికల్లో చెప్పుకున్న కేజ్రీవాల్ ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోయే సరికి ఓటమి నెపం టాంపరింగ్ పై పెట్టాడు. మోడీ ఈవీఎం మిషన్లను టాంపరింగ్ చేశాడని ఆరోపిస్తున్నాడు. ఇదే విచిత్రమో..

To Top

Send this to a friend