ఇస్రో అద్భతం.. వీడియో తీసి మరీ చూపించింది..

ఇస్రో దేశం మీసం తిప్పింది. భారత అంతరిక్ష పరిశోదన సంస్థ 104 ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యంలోకి పంపి ప్రపంచాన్నే నివ్వెరపరిచింది. దీనిపై ఇతర దేశాలు సైతం ముక్కునవేలేసుకున్నాయి. అగ్రరాజ్యాలు అమెరికా, రష్యా, చైనాల వల్ల కూడా కాని పనిని భారత్ చేసి చూపించింది. కానీ అందరిలోనూ ఆసక్తి.. ఈ 104 ఉపగ్రహాలు ఎలా కక్ష్యలోకి వెళ్లాయి. వాటిని రాకెట్ ద్వారా ఎలా విడుదల చేశారు. అసలు భూమినుంచి పైకెళ్లాక రాకెట్ నుంచి ఉపగ్రహాలు నిజంగా కక్ష్యంలో అమరాయి.. ఇలా ఎన్నో సందేహాలున్నాయి. వాటన్నింటిని పటాపంచలు చేస్తూ ఇస్రో ఎవరికీ చెప్పకుండా ఏకంగా రాకెట్ కే ఆన్ బోర్డ్ కెమెరాను పెట్టింది.. ఈ కెమెరా ఉపగ్రహాలు విడుదలవుతున్న దృశ్యాలను చిత్రీకరించాయి. ఈ వీడియోను ఇస్రో గురువారం రిలీజ్ చేసింది. భారత అంతరిక్ష పరిశోదన సంస్థ సత్తాకు నిదర్శనమైన ఈ వీడియోను మీరు చూసి మీసం తిప్పండి…
ఉపగ్రహాలు కక్ష్యలోకి పంపిన వీడియోను కింద చూడొచ్చు..

To Top

Send this to a friend