ఇలాగే పోతే.. తర్వాతీ సీఎం జగనే..


ఏపీలో ప్రతిపక్షం పటాసులా పేలుతోంది.. ప్రతిపక్ష నాయకుడు జగన్ క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా స్పందిస్తున్నారు. ఏపీలో ఎక్కడ ఏ అలజడి రేగినా అక్కడ ప్రత్యక్షమై బాధితులకు అండగా నిలుస్తున్నారు. అన్నీ తానై అధికారులు, పోలీసులతో గొడవ పడి బాధితుల గొంతుకై నిలుస్తున్నారు.. కృష్ణా జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై జగన్ వేగంగా స్పందించారు. హైదరాబాద్ నుంచి ప్రమాద స్థలానికి వచ్చి ఆ తర్వాత ఆస్పత్రిలో బాధితులను, కుటుంబీకులను పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదానికి కారణాలను దాస్తున్న కలెక్టర్, అధికారులపై శివాలెత్తారు.. డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించక నిజాలను దాస్తున్నారని మండిపడ్డారు.. డ్రైవర్ తాగి వాహనం నడిపాడని అర్థమవుతోందని.. టీడీపీ ఎంపీ ట్రావెల్స్ ను కాపాడడానికే ఇలా అధికారులు అధికారపార్టీకి కొమ్ముకాస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు..

ఇప్పుడే కాదు.. ఏపీ ప్రత్యేక హోదా కోసం విశాఖలో జరిగిన ఆందోళనలో పాల్గొనడానికి వచ్చినప్పుడు కూడా జగన్ ఇలానే ఉద్రేకంగా మాట్లాడారు.. జనం కోసం పోరాడుతున్న ప్రతిపక్ష నాయకుడు ఇలా జనంలో న్యాయం కోసం పోరాడడాన్ని ఏపీ ప్రజలు మెచ్చుకుంటున్నారు. జగన్ ఇలానే కార్యక్షేత్రంలోకి దిగి ప్రజాసమస్యలపై చురుగ్గా స్పందిస్తే రానున్న ఎన్నికల్లో ఆయనకే అధికారం తధ్యం అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బస్సు ప్రమాదం, ప్రత్యేక హోదా,, రైతుల సమస్యలు ఇలా ఏపీలో ఎక్కడ అన్యాయం జరుగుతున్న జగన్ ప్రత్యక్షమవుతూ అన్నార్థులకు అండగా నిలబడడం జగన్ లో వచ్చిన భారీ మార్పునకు నిదర్శనంగా రాజకీయ పండితులు చెబుతున్నారు. ఈ మార్పు ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో జగనే సీఎం అని ఘంటా పథంగా చెబుతున్నారు..

To Top

Send this to a friend