ఇలాంటి సీఎంను నేనెక్కడా చూడలేదు — గవర్నర్

kcr-governer-narasimhan-apnewsonline

‘ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే ఆలోచన ఎక్కడున్నా ఆయన స్వీకరిస్తారు. ప్రత్యర్థులు సలహాలు ఇచ్చినా అమలు పరుస్తారు. మా లాంటి పెద్దలను సలహాలు అడుగుతారు.. అసలు ఇంతటి సుపరిపాలన అందించే సీఎంను తాను ఎక్కడా చూడలేదని ’ సీఎం కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించారు గవర్నర్ నరసింహన్. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా గవర్నర్ నరసింహన్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు సీఎం కేసీఆర్, తెలంగాణ మంత్రులు రాగా విలేకరులతో మాట్లాడారు.. రాష్ట్ర ప్రజల మేలు కోసం ఎంతటి క్లిష్ట ఆలోచననైనా కేసీఆర్ పట్టుదలతో అమలు చేస్తారని.. వెనక్కి తగ్గరని గవర్నర్ కేసీఆర్ ను ప్రశంసించారు.
తెలంగాణ ఏర్పడితే శాంతి భద్రతలు గతితప్పుతాయని ప్రచారం జరిగింది.. కానీ కేసీఆర్, పోలీసులు అత్యాధునిక పోలీస్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చి రాష్ట్రంలో క్రైం రేటును తగ్గించి సవాలును స్వీకరించారని గవర్నర్ ప్రశంసించారు. కాగా ఉమ్మడి గవర్నర్ వద్దకు కేవలం తెలంగాణ సీఎం కేసీఆర్ లు మాత్రమే వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్ర నుంచి ఎవరూ రాకపోవడంతో ఏకపక్షంగా వేడుకలు ముగిసిపోయాయి.

To Top

Send this to a friend