ఇప్పుడు మోడీ కళ్లు చల్లబడ్డాయి?

బాప్ రే మోడీజీ దేశ ప్రధానిగా అధికారం చేపట్టాక ఎంత మార్పు.. అప్పటివరకు కాంగ్రెస్ వాళ్లు ఇతర రాష్ట్రాల్లో వేలు పెట్టేవారే కాదు.. ఎదో ఎన్నికలు వచ్చినప్పుడు వ్యూహాలు పన్నేవారు కానీ.. మోడీజీ నిండుగా ఉన్న రాష్ట్రాల ప్రభుత్వాలనే కూలదోసి బీజేపీని గద్దెనెక్కిస్తున్నారు. లేదంటే బీజేపీ కి అనుకూల ప్రభుత్వాలకు వత్తాసు పలుకుతున్నారు.. ‘జర మోడీ తో జాగ్రత్తగా ఉండాలే’ అని సీఎం కేసీఆర్ కూడా అప్పుడప్పుడు చెబుతుంటే ఏమో అనుకున్నాం కానీ ఇప్పుడర్థమైంది..
హర్యానాలో పచ్చగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి తిరుగుబాటును ప్రేరేపించి బీజేపీ ప్రభుత్వాన్ని అప్పట్లో ఏర్పాటు చేయించారు. సుప్రీం బీజేపీ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసి మళ్లీ కాంగ్రెస్ నే గద్దెనెక్కించింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్ లో అదే పునరావృతమైంది.. అక్కడ బీజేపీ అధికార దాహంతో రాష్ట్రాన్ని చేజిక్కించుకోవాలని చూసింది. ఉత్తరఖండ్ లో కూడా తిరుగుబాటును ప్రేరేపించి బీజేపీ గద్దెనెక్కింది.. ఇలా ప్రత్యర్థి కాంగ్రెస్ ప్రభుత్వాలున్న రాష్ట్రాలను పనిగట్టుకొని అస్థిర పరిచి అక్కడ బీజేపీని గద్దెనెక్కించే బాధ్యతలను కమల దళాదిపతులు మోడీ, అమిత్ లు దిగ్విజయంగా చేస్తూ వచ్చారు. సుప్రీం మొట్టికాయలు వేసినా.. కాంగ్రెస్ వాళ్లు ఆందోళనలు చేసినా వారి పంథా వీడలేదు..
ఇప్పుడు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు తమిళనాడులో అమ్మ జయలలిత మరణం బీజేపీ విస్తరణ కాంక్షకు సరిగ్గా సరిపోయింది. తనను శరణు వేడిన తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వంకు పూర్తి అండదండలు ఇచ్చి మోడీజీ తమిళ రాజకీయాలను ప్రస్తుతం మలుపుతిప్పారు. ఏకంగా సీఎం అవుదామనుకున్న శశికళను గద్దెనెక్కకుండా గవర్నర్ ను ఆపేసి భలే ప్లాన్ చేశారు. పన్నీర్ తో ‘అమ్మకల్లోకి వచ్చింది’ అని సెంటిమెంటు ప్రదర్శింపచేసింది. ఇలా మోడీ చక్రవ్యూహానికి తమిళనాడు రాజకీయాలు అస్తిరపడ్డాయి. పన్నీర్ సెల్వంను మళ్లీ సీఎంను చేసేందుకు మోడీ ఆడుతున్న గేమ్ లో శశికళ బలైపోయింది. పన్నీర్ ను సీఎంను చేసి అన్నాడీఎంకేను బీజేపీకి మద్దతుగా నిలిపేందుకు మోడీ చేస్తున్న ప్లాన్ భలే వర్కవుట్ అవుతోంది.. మోడీనా మజాకా..?

To Top

Send this to a friend