ఇద్దరు సీఎంలతో బాలయ్య సినిమా ..

Balakrishna

ఈ అదృష్టం ఎవ్వరికీ రాదేమో.. ఏకంగా తెలంగాణ, ఏపీ సీఎంలతో సినిమాను చూసే భాగ్యం మన బాలయ్యకు కలిగింది. బాలక్రిష్ణ ప్రతిష్టాత్మకంగా తీసిన గౌతమి పుత్ర శాతకర్ణి మూవీ ఈనెల 12న రిలీజ్ కాబోతోంది.. ఈ సందర్భంగా ఇప్పటికే బాలయ్య, టీం అన్ని ఏర్పాట్లు చేసింది.. బెన్ ఫిట్ షోలను వేస్తోంది.. కాగా శాతకర్ణి సినిమాకు పన్ను మినహాయింపును ఇచ్చినందుకు బాలక్రిష్ణ ఈరోజు సీఎం కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తన 100 సినిమాను చూడాలని గతంలో సినిమా ప్రారంభంలో కేసీఆర్ చెప్పిన మాటలను గుర్తుచేసి చూసేందుకు రావాలని కోరారు. కేసీఆర్ నివాసముండే ప్రగతి భవన్ కు వెళ్లిన బాలయ్య కేసీఆర్ కు సినిమా పాటల సిడీని అందజేసి కులాసాగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ నెల 12న ప్రసాద్ ఐమ్యాక్స్ లో వేసే బెన్ ఫిట్ షోకు వచ్చి తనతోపాటు సినిమా చూడాలని కేసీఆర్ ను బాలక్రిష్ణ ఆహ్వానించారు. దీనికి సానుకూలంగా కేసీఆర్ స్పందించారు.

అనంతరం విలేకరులతో మాట్లాడిన బాలయ్య 12న కేసీఆర్ తో హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ లో బెన్ ఫిట్ షో చూస్తానని.. అనంతరం 13న విజయవాడకు చేరుకొని ఎన్టీఆర్-బసవతారకంలకు నివాళులర్పించి అక్కడ ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి సినిమా చూస్తానని చెప్పాడు. ఇలా ఇద్దరు సీఎంలతో సినిమా చూసిన హీరోగా బాలయ్య అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు..

To Top

Send this to a friend