‘ఇద్దరం’ ఆడియో విడుదల

సంజీవ్, సాయి కృప జంటగా జవాన్ అండ్ కాస్పియన్ ఇంటర్నేషనల్ పతాకంపై సుధాకర్ వినుకొండ దర్శకత్వం వహిస్తూ.. నిర్మిస్తోన్న చిత్రం ‘ఇద్దరం’. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. తమ్మారెడ్డి భరద్వాజ్ బిగ్ సీడీను, ఆడియో సీడీలను విడుదల చేసి మొదటి సీడీని నవదీప్ కు అందించారు. ఈ సందర్భంగా..

తమ్మారెడ్డి భరధ్వాజ్ మాట్లాడుతూ.. ”రంగనాథ్ గారు నాకిష్టమైన నటుడు. ఆయన ఈ సినిమాలో నటించడం సంతోషంగా ఉంది. సంజీవ్ తో నాకు ముందే పరిచయం ఉంది. ఈ సినిమా ప్రోమో నాకు చూపించారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. బాగా తీశారు. ఈ సినిమాతో అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను” అని చెప్పారు.
నవదీప్ మాట్లాడుతూ.. ”ట్రైలర్, పాటలు చాలా బావున్నాయి. సినిమా కూడా ఎంటర్టైనింగ్ ఉంటుందని భావిస్తున్నాను. టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్” అని చెప్పారు.
దర్శకుడు సుధాకర్ మాట్లాడుతూ.. ”ఇదొక రొమాంటిక్, సస్పెన్స్, థ్రిల్లర్ మూవీ. రోజు న్యూస్ పేపర్లలో గ్యాంగ్ రేప్స్ జరుగుతున్నాయని చదువుతుంటాం. ఆ గ్యాంగ్ రేప్ చేసే వాళ్లలో ఓ మంచి వ్యక్తి ఉంటే ఏమవుతుందనే కాన్సెప్ట్ తో సినిమా చేశాం. సినిమా చిత్రీకరణ వైజాగ్, మచిలీపట్టణం, మరియు బీదర్ లలో చేశాం. జులై 1 న సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం” అని చెప్పారు.
సంగీత దర్శకుడు కిరణ్ శంకర్ మాట్లాడుతూ… ”ప్రతి ఒక్కరు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. నాకు ఈ చిత్రానికి మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన సుధాకర్ గారికి థాంక్స్” అని చెప్పారు.
కో ప్రొడ్యూసర్ శివదీప్ స్వామి మాట్లాడుతూ.. ”సినిమా బాగా వచ్చింది. కిరణ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. పాటలు, సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను” అని చెప్పారు.
సంజీవ్ మాట్లాడుతూ.. ”వెల్కమ్ ఒబామా నా మొదటి సినిమా. ఇది నా రెండో చిత్రం. మంచి మ్యూజిక్ కుదిరింది. సుధాకర్ అన్ని తానై ఈ సినిమాకు పని చేశారు. అందరికి ఈ సినిమాతో మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను” అని చెప్పారు.

ఈ చిత్రానికి ఎడిటర్: నాగేంద్ర కుమార్, డైలాగ్స్: టైం నాని, సినిమాటోగ్రఫీ: ఎస్.జె.సిద్ధార్థ్, మ్యూజిక్ డైరెక్టర్: కిరణ్ శంకర్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: శర్మ ఎం.కె.వి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్ సిరిగిరి, కో ప్రొడ్యూసర్స్: శివదీప్ స్వామి, గంగిరెడ్డి, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్: సుధాకర్ వినుకొండ.

To Top

Send this to a friend