ఇదేం పద్దతి ఆంధ్రజ్యోతి ..

ఇటీవల ఆంధ్రజ్యోతి దినపత్రిక సినిమా సమీక్షలు రాయడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. తమకు ప్రకటనలు ఇవ్వని వారి సినిమాలను విమర్శించడం, ఇచ్చినవారి సినిమాలు బాగుంటే సమీక్షలు రాయడం, బాగులేకుంటే సమీక్షలు రాయడం మానేయడం కార్యక్రమంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ వారం విడుదలైన టిప్పు సినిమాను తుప్పు అంటూ ఉతికి ఆరేసింది. అయితే దీనిపై ఆ సినిమా హీరో కార్తీక్ తీవ్రంగా స్పందించారు. సినిమా రంగంపై ఆసక్తితో వచ్చే కొత్తవాళ్లని కాస్తయినా ప్రోత్సహించాలని, అలాకాకుండా ఇలా నిలదీయడం సరికాదని ఆయన అన్నారు. మీరు సినిమా తీసి, దానిపై ఇలా సమీక్ష వస్తే మీరు ఎలా ఫీలవుతారు అని నిలదీసారు. అన్నింటికి మించి, తన సినిమా గొప్పదని, మంచిదని తాను చెప్పడం లేదని, అయితే తన నటన, వాచకం, విషయాల్లో మంచి రిమార్కులే వచ్చాయని, అందరూ తన నటన, వాచకం విషయంలో బాగానే చేసాడని రాసారని, కానీ ఆంధ్ర జ్యోతి మాత్రం తనది స్టోన్ ఫేస్ అని డైలాగులు చెప్పలేకపోయాడని పేర్కొన్నారని, అదే బాధ అనిపించిందని కార్తీక్ పేర్కోన్నారు. తనది స్టోన్ ఫేస్ నా కాదా, సినిమాలో బాగా చేసానా లేదా అన్నది మీడియా జనాలే సినిమా చూసి చెప్పాలని అన్నారు. స్టోన్ ఫేస్ అని, బాగా చేయలేదని రాస్తే, ఏ అప్ కమింగ్ హీరోతో అయినా మళ్లీ సినిమా చేయడానికి ఇంకెవరు ముందుకు వస్తారని ఆయన ప్రశ్నించారు. విడుదలకు ముందు రోజు రాత్రి 7.10 నిమషాలకు రవివర్మ (ట్రూకాలర్ ప్రకారం) అనే వ్యక్తి కాల్ చేసారని, ఎత్తకపోతే, మెసేజ్ పెట్టారని దర్శకుడు దానేటి వెల్లడించారు. దాంతో 7.30కి మాట్లాడారని, చౌదరి అనే వ్యక్తి మాట్లాడుతూ ఆంధ్ర జ్యోతికి 11 లోపు ప్రకటనలు ఇస్తే సరి అని లేదంటే నెగిటివ్ సమీక్ష రాస్తామని చెప్పారట. మెసేజ్ ప్రూఫ్, కాల్ ప్రూఫ్ అన్నీ వున్నాయన్నారు.

To Top

Send this to a friend