ఇది బామ్మర్ధి సినిమా.. అది తెలంగాణ సినిమా.

balakrishna-chandrababu

చంద్రబాబు అశ్రిత పక్షపాతం చూపారు.. బామ్మర్దికి ఒక రూలు.. బయటవారికి మరో రూలు అమలుచేసి విమర్శల పాలవుతున్నారు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సినీ దర్శకుడు గుణశేఖర్ రాసిన లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.. గుణశేఖర్ వరంగల్ కేంద్రంగా పాలించిన రాణి రుద్రమదేవి కథను అప్పట్లో రూపొందించారు. ఈ సినిమా చారిత్రక నేపథ్యం… తెలంగాణ ప్రాంతానికి చెందింది కావడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ పన్ను మినహాయింపును ఇచ్చారు. దీనికి గుణశేఖర్ స్వయంగా వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు కూడా.. కానీ ఏపీ సీఎం చంద్రబాబు రుద్రమదేవి సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వలేదు. దీంతో అప్పట్లోనే పెద్ద ఎత్తున బాబుపై విమర్శలు వచ్చాయి. తెలంగాణ చరిత్రకు సంబంధించిన సినిమా కావడంతో బాబు ఇలా పన్ను మినహాయింపు ఇవ్వలేదని ఆరోపణలు వెలువడ్డాయి.

కట్ చేస్తే ఇప్పుడు బాలక్రిష్ణ నటించిన 100 వ చిత్రానికి అదే రీతిలో చారిత్రక చిత్రమని భావించి తెలంగాణ సీఎం కేసీఆర్ పన్ను మినహాయింపును ఇచ్చారు. బామ్మర్ధి, సొంత ఎమ్మెల్యే సినిమాకు మొదట పన్ను మినహాయింపు ఇస్తే విమర్శలు వస్తాయని తెలిసి చంద్రబాబు వ్యూహాత్మకంగా తెలంగాణ సీఎం ప్రకటించాక ఆలస్యంగా పన్ను మినహాయింపును ఇచ్చారు. దీంతో లాంఛనం పూర్తయ్యింది.. అయితే గుణశేఖర్ తాజాగా శాతకర్ణి మూవీకి పన్ను మినహాయింపు ఇచ్చినందుకు బాబుకు ఘాటుగా లేఖ రాశారు.. ‘‘శాతకర్ణికి ఇచ్చి తన సినిమాకు ఎందుకు పన్ను మినహాయింపు ఇవ్వలేదని.. తాను కట్టిన వినోద పన్నును తిరిగి తనకు వెనక్కి ఇవ్వాలంటూ’’ గుణశేఖర్ చంద్రబాబును డిమాండ్ చేశారు.. ఇలా బామ్మర్ది సినిమాపై అవాజ్యప్రేమను ప్రదర్శించి గుణశేఖర్ కు అడ్డంగా దొరికన బాబు ప్రస్తుతం విమర్శల జడివానలో తడిసిపోతున్నాడు..

To Top

Send this to a friend