‘ఇందిరా’ఖాన్,‘రాజీవ్’ఖాన్.. గాంధీలుగా ఎలా అయ్యారు..?


ఇందిర పైచదువులకు ఇంగ్లండ్ వెళ్ళారు. అక్కడ ఆమె జీవితం మరో మలుఫు తిరిగింది. అక్కడ కూడా ఇందిర స్వాతంత్రోద్యమ స్ఫూర్తి వదల్లేదు. ఇండియాలీగ్ అనే సంస్థలో చేరారామె. ఆక్సఫర్డ్‌ యూనివర్శిటీలో చదువుతున్న రోజుల్లో ఫిరోజ్ ఖాన్ జర్నలిస్టుగా ఇందిరకు పరిచయమయ్యారు. ఇక్కడా ఇందిరను రాజకీయాలు వెంటాడాయనే చెప్పాలి. ఎందుకంటే జర్నలిజం అంటే రాజకీయాలతో అవినాభావమున్న విషయం కాబట్టి… అలా మొదలైన వారి పరిచయం ప్రణయంగా మారింది. అసలు చిక్కంతా అది పరిణయంగా మారడంలోనే కనిపించింది… ఇందిర ప్రేమ వ్యవహారం తండ్రి నెహ్రూకి ఇష్టముండేది కాదు. ఇందిరా ప్రియదర్శిని తెలివిగా మహాత్మా గాంధీని ఆశ్రయించారు. గాంధీ మాటంటే నెహ్రూకు వేదవాక్కు… ఇందిరా- ఫిరోజ్ ల వివాహానికి ఒప్పుకున్నారాయన… గాంధీజీ దత్తతు తీసుకోవడంతో ఫిరోజ్ ఖాన్, ఫిరోజ్ గాంధీ గా మారిపోయారు. 1942లో హైందవ సంప్రదాయం ప్రకారం ఇందిర, ఫిరోజ్ ల వివాహం జరిగింది. దీంతో ఇందిరాగాంధీగా అయిపోయారామె. సరిగ్గా అదే సంవత్సరం క్విట్ ఇండియా ఉద్యమంలో జైలుకెళ్ళారు ఇందిర. తరువాతి సంవత్సరంలో అలహాబాదులో భర్తతో కలిసి ఉంటున్న సమయంలో విభేదాలు రావడంతో ఢిల్లిలో ఉంటున్న తండ్రి దగ్గరుకు చేరకున్నారు ఇందిరాఫిరోజ్ గాంధీ.

అలహాబాదు నుంచి ఢిల్లి రావడం ఇందర రాజకీయవేత్తగా ఎదగడానికి బాటలు వేశాయని చెప్పవచ్చు. ఇందిర తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ప్రత్యక్ష రాజకీయాలను ఔపోసన పట్టసాగారు. తండ్రికి ఒక మంచి మిత్రురాలిగా మసులుతూ ఆయన కార్యదర్శిగా జీతం లేకుండా పనిచేశారామె.. కాలక్రమేణా అల్లుడు ఫిరోజ్ గాంధీ మామ నెహ్రూ రాజకీయ శత్రువుగా మారిపోయారు. ప్రతిపక్షంలో ఉంటూ ప్రభుత్వంలోని కుంభకోణాలను వెలికితీసిన ఘనత కూడా ఫిరోజ్ గాంధీకి ఉంది. ఆ క్రమంలో ఇన్సూరెన్స్ కుంభకోణం బట్టబయిలు చేయడంతో జవహర్లాల్ గవర్నమెంటులోని ఆర్ధిక మంత్రి రాజీనామా చేయాల్సి రావడం అందుకు గొప్ప ఉదాహరణ. ఒకానొక సమయంలో ఇందిర తన భర్తకు వ్యతిరేఖంగా తండ్రికి అనుకూలంగా రాయబరేలి నియోజకవర్గంలో ప్రచారం చేశారు కూడా…

To Top

Send this to a friend