ఇంత ప్రేమను కేసీఆర్ సైతం ఊహించలేదు..

 

11

మంచి చేస్తే జనం గుర్తుంచుకుంటారనేదానికి కేసీఆర్ ఒక మంచి ఉదాహరణ.. ఒక పార్టీ అయినా ప్రభుత్వమైనా బలంగా ప్రజల్లో మనుగడ సాధించాలంటే దానికి మంచి నాయకుడు ఉండాలి.. ఇప్పుడు టీఆర్ఎస్ కు బలమైన నాయకుడు కేసీఆర్ ఆ పార్టీని తెలంగాణలో తిరుగులేకుండా తయారుచేశారు. ఉద్యమనాయకుడిగా ఎన్నో అనుభవాలు చవిచూసిన కేసీఆర్ ఆ అనుభవాల్లోంచే తెలంగాణ సీఎంగా ఎన్నికయ్యారంటే అది ఆయన పోరాటపటిమను సూచిస్తోంది. బోటాబోటీ మెజార్టీతో గద్దెనెక్కిన ఆపరేషన్ ఆకర్ష్ తో ముందు ప్రభుత్వ సుస్థిరతకు ప్రయత్నించారు. బలం పెంచుకొని అభివృద్దిపై దృష్టి సారించారు. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ ను రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన వైఎస్ స్టామినాను స్ఫూర్తిగా తీసుకొని కేసీఆర్ రాజకీయంగా ఎదిగారు. ఆ ప్రణాళికలే కేసీఆర్ నాయకత్వానికి జనం జేజేలు పలకడానికి దోహదపడింది..
మొత్తంగా ఇప్పుడు తెలంగాణ అంటే టీఆర్ఎస్ .. టీఆర్ఎస్ అంటే కేసీఆర్.. తెలంగాణ ప్రజలు తమ సొంత ఇంటి పార్టీ టీఆర్ఎస్ ను విశ్వసిస్తున్నారు. కేసీఆర్ పథకాలు, ప్రాజెక్టులు ఇలానే కొనసాగి పూర్తయితే తెలంగాణ ను బంగారు తెలంగాణగా మార్చిన కేసీఆర్ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా మిగిలిపోతారు.. ఒక వేళ ఇవి గాలిబుడగలైతే 2019 ఎన్నికల్లో మరో పార్టీకి అవకాశం దక్కుతుంది..

33

కేసీఆర్ ఇటీవల శాసనసభలో ఉన్నపళంగా ఓ కొత్త పథకాన్ని ప్రకటించారు. ఒంటిరి మహిళలకు నెలనెలా జీవనభృతి అందించేందుకు నిర్ణయించారు. ఈ నిర్ణయం తెలంగాణలో అందరికీ చేరువయ్యింది. ముఖ్యంగా ఒంటిరి మహిళలు, మహిళా సంఘాలు సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించాయి. ఆయనకు క్షీరాభిషేకాలు నిర్వహిస్తున్నాయి. పలు జిల్లాల నుంచి సీఎం కేసీఆర్ నివాసమైన ప్రగతి భవన్ కు చాలా మంది ఒంటరి మహిళలు పెద్దసంఖ్యలో హాజరై సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కొన్ని ఏళ్లు గా ఇబ్బందులు పడుతున్న మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదని మీరు పట్టించుకొని పెన్షన్ ఇస్తున్నారని మహిళలకు ఆనంద భాష్పాలతో కృతజ్ఞతలు తెలుపుతున్నారు.. ప్రజలకు మంచి చేస్తే ఎంతలా ఆదరిస్తారో చెప్పడానికి ఈ ఉదంతం ఒక చక్కటి ఉదాహరణ..

To Top

Send this to a friend