ఇంత అద్భుత ఫీచర్ల ఫోన్.. ఇంత తక్కువ ధరలోనా.?

ఘ్జీఒమి రెడ్ మీ మోబైల్ ఫోన్ల ఉత్పత్తి సంస్థ దేశీయ మార్కెట్లో సంచలనాలకు నాంది పలుకుతోంది.. 25వేల విలువ చేసే ఫోన్లలో ఉండే సౌకర్యాలు.. హైఎండ్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో ఓ సరికొత్త ఫోన్ ను ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇండియాలో ఈ నెల 23న రిలీజ్ కానున్న ఈ అద్భుత ఫీచర్లు ఉన్న ఫోన్ .. కేవలం తక్కువ ధరకే లభ్యమవుతుండడం గమనార్హం..

ఈనెల 23న దేశీయ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్, ఘ్జీఒమి రెడ్ మీ వెబ్ సైట్లలో షియోమీ రెడ్ మీ తన సరికొత్త నోట్ 4 స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.9999కే విడుదల చేస్తోంది.. ఇందులో స్నాప్ డ్రాగన్ 625 చిప్ సెట్, 2 గిగా హెడ్జ్ అక్టాకోర్ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 4100 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం, 5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ తెర, ముందు 5 మెగాపిక్సల్ , వెనుక 13 ఎంబీ కెమెరా, అండ్రాయిడ్ మార్ష్ మాల్లో వెర్షన్, అంతర్గతం 64జీబీ ఇన్ బిల్ట్ మెమోరీ తో నోట్ 4 సంచనాలను సృష్టిస్తోంది.. ఇప్పటికే ఈ భారీ ర్యామ్, ప్రాసెసర్ ఉన్న ఫోన్ కోసం టెక్ ప్రియులు ముందుస్తు బుకింగ్ లకు సిద్ధపడ్డారట.. మల్టీటాస్కింగ్, 3డీ గేమ్స్ ఆడేందుకు బాగా ఉపయోగపడే ఈ హైఎండ్ ఫోన్ మార్కెట్లో ప్రస్తుతం సంచలనాలు సృష్టిస్తోంది..

To Top

Send this to a friend