ఇండియా జెండా.. పాక్ కు భయం

దేశంలోనే ఇప్పటివరకు ఎగురవేసిన అతిపెద్ద జెండా తెలంగాణదే ఉండేది. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని హైదరాబాద్ నెక్లస్ రోడ్డులో 300 అడుగుల ఎత్తున భారీ జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. కోల్ కతకు చెందిన స్కిప్పర్ కంపెనీ దీన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు దానికంటే మరో 60 అడుగుల ఎక్కువ ఎత్తులో అమృత్ సర్ లోని అటారీ సరిహద్దు వద్ద దాదాపు 360 అడుగుల ఎత్తులో కొత్త జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. ఈ జెండాను పంజాబ్ లోని పాకిస్తాన్ సరిహద్దులోని అటారీ వద్ద ఏర్పాటు చేశారు. ఇది పాకిస్తాన్ బార్డర్ కు కేవలం 200 మీటర్ల దూరం.. పంజాబ్ ఆర్థిక రాజధాని లాహోర్ నుంచి చూసినా ఈ జెండా కనిపిస్తుంది.. ఇప్పుడు ఈ జెండా ఏర్పాటుతో పాకిస్తాన్ భయపడుతోందట..

పంజాబ్ ప్రభుత్వం దాదాపు రూ.3.50 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టింది. దేశంలోనే అత్యంత ఎక్కువ ఎత్తు, పెద్దదైన జాతీయ పతకాన్ని పాకిస్తాన్ బార్డర్ లో నిన్న ఎగురవేశారు. బీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ జాతీయ పతకాన్ని నిలబెట్టారు. ఈ కాగా ఈ జెండా లో నిఘా కెమెరాలు పెట్టి తమ ప్రాంతంపై నిఘా ఏర్పాటు చేసిందోమోనని అక్కడి పత్రికలు,ప్రభుత్వం భావిస్తోందట.. పాక్ సైన్యం కూడా భారత అతిపెద్ద జాతీయ జెండా ఏర్పాటుపై సందేహాలు వ్యక్తం చేసిందట.. అంతరిక్ష ప్రయోగాల్లో సూపర్ గా దూసుకుపోతున్న భారత్ ఈ జెండాతో ఏదో కుట్ర లేదా నిఘాను పాకిస్తాన్ పై పెట్టిందని పాకిస్తాన్ ప్రభుత్వం భావిస్తున్న పత్రికలు రాశాయి. భారత్ జెండాకు పాక్ భయపడుతోందని వ్యాఖ్యానించాయి.

To Top

Send this to a friend