ఇండియా ఖేల్ ఖతం.. అద్భుతం జరగాల్సిందే..


ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇండియా గెలవాలంటే అద్భుతం జరగాల్సిందే.. అంతలా ఆస్ట్రేలియా టెస్ట్ పై పట్టుబిగించింది. టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్న అసీస్ తొలుత తొలిఇన్నింగ్స్ లో 260 పరుగులకు అలౌట్ అయ్యింది. అనంతరం భారత్ బ్యాంటింగ్ ఘోరవైఫల్యంతో 105కే కుప్పకూలింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 285 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకొని భారత్ ముందు ఆస్ట్రేలియా 441 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇది కొండంత లక్ష్యం అయినా ఏదో ఆశ.. విరాట్ సేనపై నమ్మకం.. కానీ మూడోరోజే ఆ ఆశలు అడియాశలయ్యాయి.
రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ను మళ్లీ అసీస్ బౌలర్లు దెబ్బతీశారు. మధ్యాహ్నానికే భారత్ ఓపెనర్లు విజయ్, రాహుల్, కోహ్లీ వికెట్లు కోల్పోయి 52కే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. దీంతో భారత బ్యాట్స్ మెన్ ఎదురీదుతున్నారు.
ఈ మ్యాచ్ లో భారత్ గెలవాలంటే అద్భుతం జరగాల్సిందే.. గెలుపుపై ఆశలు లేవు. ఇంకా రెండు రోజులు ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో భారత్ అసీస్ బౌలర్లు ఎదురేగి ఆ భారీ లక్ష్యం చేధించడం కష్టమే.. అలాగని కాచుకుని నిలబడడం కష్టమే.. అందుకే భారత్ ఓటమి తప్పేలా లేదు. బలీయ భారత్ ముందు అసీస్ దిగదుడుపే అనుకుంటే ఇలా ట్రైన్ రివర్స్ కావడం భారత్ అభిమానులను నిరాశపరిచింది..

To Top

Send this to a friend