ఇండియా-ఏ, ఇంగ్లండ్ ల ప్రాక్టీస్ మ్యాచ్ లో రాయుడు అజేయ సెంచరీ

ambati-rayudu-apnewsonlinein

ఇంగ్లాడ్ తొ జరుగుతున్న క్రికెట్ మాచ్ లొ మన తెలుగుతెజం ఆంబటిరాయుడు చెలరేగి అడుతున్నాడు. ముంబైలో ఇండియా-ఏ, ఇంగ్లండ్ ల మధ్య జరుగుతున్న డేనైట్ ప్రాక్టీస్ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. వచ్చిన అవకాశాన్ని భారత బ్యాట్స్ మెన్ పూర్తిగా వినియోగించుకున్నారు. వన్ డౌన్ బ్యాట్స్ మెన్ అంబటి రాయుడు ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీ సాధించాడు. రాయుడు 97 బంతుల్లో అజేయ సెంచరీ సాధించాడు. మరోవైపు శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్ లు హాఫ్ సెంచరీలతో విరుచుకుపడ్డారు.

ఓపెనర్ శిఖర్ ధావన్ 84 బంతులు ఆడి 1 సిక్సర్, 8 ఫోర్ల సాయంతో 63 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఓపెనర్ మణ్దీప్ సింగ్ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. ధావన్ ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన యువరాజ్ సింగ్ 2 సిక్సర్లు, 6 ఫోర్ల సాయంతో 51 పరుగులతో ఆడుతున్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 41 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 226 పరుగులు. సెంచరీ పూర్తి చేసుకున్న రాయుడు… ధోనీకి బ్యాటింగ్ అవకాశం కల్పించేందుకు ఫీల్డ్ ను వదిలి వెళ్లాడు. దీంతో, ధోనీ క్రీజులోకి వచ్చాడు. మరోవైపు, కెప్టెన్ గా ధోనీకి ఈ మ్యాచే ఆఖరుది.

To Top

Send this to a friend